Advertisement

  • మన జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే జీవితం మొత్తం ఆనందమయమే ...

మన జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే జీవితం మొత్తం ఆనందమయమే ...

By: Sankar Sun, 19 July 2020 5:41 PM

మన జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే జీవితం మొత్తం ఆనందమయమే ...



పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగే అపురూపమైన వేడుక ..పెళ్లి అనే బంధంతో ఒక ఇద్దరు వ్యక్తులు తమ తర్వాత జీవితం మొత్తం ఒకరికోసం మరొకరు బతుకుతారు ..మరి అలంటి అత్యంత పవిత్రమైన పెళ్లి చేసుకునేముందు , మనం చేసుకునే వ్యక్తి గురించి ఒకటికి రెండు సార్లు తెలుసుకోవాలి ..ఎందుకంటే ఒక్కసారి పెళ్లి ముడి పడితే దానిని విప్పడం అంత తేలిక కాదు..మరి మనం చేసుకునే వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చూదాం ..

1. తాను నవ్వడం, చుట్టూ ఉన్నవారిని నవ్వించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి వారు ఉంటే ఏ బంధమైనా బోర్ కొట్టకుండా ఉంటుంది. అలాంటివారితో సమయం గడపాలని ఉంటుంది. అంతేకానీ, ముభావంగా ఉంటూ ఏదో ఇబ్బంది పడుతున్నట్లుండేవారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకోం. అందుకే మీ జీవిత భాగస్వామికి సెన్సాఫ్ హ్యూమర్ ఉందో లేదో తెలుసుకోవాలి..

2. సెన్స్ అఫ్ హ్యూమర్ ఉండాలి కానీ , ప్రతీ ఒక్క విషయాన్ని జోక్‌గా తీసుకోకూడదు. కొన్ని విషయాల్లో ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించాలి. మనకి కాబోయే లైఫ్ పార్టనర్‌ నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. ప్రతీ ఒక్క విషయంలో తాను ఖచ్చితమైన నిర్ణయాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా ముక్కుసూటితనం ఉండాలి. ఇది ఏ విషయంలోనైనా అలానే ఉండాలి. ప్రతీ ఒక్క విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలగాలి. చెప్పే విషయం సంతోష పెట్టినా.. బాధపెట్టినా.. ముక్కుసూటిగా చెప్పగలగాలి. ఇలా చెప్పే గుణం మీరు కోరుకునేవారికి ఉందో లేదో తెలుసుకోండి..

3. ఏ బంధమైనా ఎక్కువకాలం నిలవాలంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం. అందుకే మీ బంధాన్ని పదిలపరుచుకోవాలంటే లైఫ్ పార్టనర్ ఎంపికలో అన్నీ విషయాలు ఆచితూచి వ్యవహారించాలి. ప్రతీ ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.

4. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయాలు ఉంటాయి. అవి అందరికీ నచ్చాలని లేదు. కాబట్టి.. మన అభిప్రాయాలు నచ్చేవారు.. వాటికి విలువనిచ్చేవారి గురించి తెలుసుకుని అలాంటి వారిని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఆ రిలేషన్ ఎంతో అందంగా.. మరింత ఆనందంగా ఉంటుంది.

5. అదే విధంగా.. మనం ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నామో.. మన వైపు నుంచి కూడా ఎదుటివారు అలానే ఆలోచిస్తారనే విషయం మరిచిపోకూడదు. ఖచ్చితంగా మనం కూడా వారిని అన్నీ విషయాల్లోనూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జీవిత భాగస్వామి నుంచి ఎదురుచూసే లక్షణాలన్నీ మనలోనూ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది..

Tags :
|
|
|
|

Advertisement