Advertisement

  • ఈ లక్షణాలు ఉన్న అమ్మాయి ఎదురయితే అస్సలు వదులుకోకండి

ఈ లక్షణాలు ఉన్న అమ్మాయి ఎదురయితే అస్సలు వదులుకోకండి

By: Sankar Sun, 30 Aug 2020 11:28 AM

ఈ లక్షణాలు ఉన్న అమ్మాయి ఎదురయితే అస్సలు వదులుకోకండి


పెళ్లి అనేది రెండు జీవితాలను ముడివేసి గొప్ప బంధం..మరి అలాంటి బంధంలో ఒడిడుకులు రాకుండా ఉండలాంటే భార్య భర్తలు ఇద్దరు సరైన వారు అయి ఉండాలి ...ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు బాగాలేకపోయిన సంసారం నాశనం ఐతుంది..ఇప్పుడు అమ్మాయిలో ఈ కింద చెప్పుకునే లక్షణాలు ఉంటె మాత్రం అబ్బాయిలు అటువంటి అమ్మాయిలను అసలు మిస్ అవొద్దు..ఆ లక్షనాలు ఏంటో చూదాం ..

1. అమ్మాయి అయినా , అబ్బాయి అయినా తమ పార్టనర్‌గా నిజాయతీగా ఉండే వారినే కోరుకుంటారు. మీకు అలాంటి అమ్మాయి తారసపడితే తనను వదులుకోకండి

2. ప్రతికూల ఆలోచనలు విషంతో సమానం. కాబట్టి సానుకూలంగా ఆలోచించే వారికి ప్రాధాన్యం ఇస్తే జీవితం సాఫీగా సాగుతుంది. అదే ప్రతికూల ఆలోచన ధోరణి వల్ల హృదయ స్పందన రేటు పెరగడం, జీర్ణ సమస్యలు లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

3. రిలేషన్‌షిప్‌లో గొడవలు సహజమే. కానీ అలాంటప్పుడు సర్దుకుపోతేనే బంధం నిలబడుతుంది. కాబట్టి కాంప్రమైజ్ అయ్యే అమ్మాయి దొరికితే లక్కీ.

4. మీ దగ్గర ఏదీ దాచకుండా.. వ్యక్తిగత విషయాల్ని ఓపెన్‌గా చెప్పే అమ్మాయి దొరకడం లక్కీ. శారీరకంగా అందంగా ఉండే అమ్మాయిల కంటే ఇలాంటి క్వాలిటీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వడం బెటర్.

5. తను తెలివైన అమ్మాయే కాకుండా.. మీ లక్ష్యాలను చేరుకోవడంలో తోడుగా నిలిచే అమ్మాయిని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. స్మార్ట్‌గా ఆలోచించే అమ్మాయిలు మనం మన లక్ష్యాలను చేరుకోవడానికి సహకరించడంతోపాటు.. వారు కూడా తమ గోల్స్‌ను రీచ్ అవుతారు

6. అమ్మానాన్నతో మంచి అనుబంధం ఉన్న అమ్మాయిని పార్టనర్‌గా ఎంపిక చేసుకోవడం బెటర్. టీనేజీలో, చిన్నతనంలో తల్లిదండ్రుల ప్రేమను పొందడం వల్ల వారికి అనుంబంధాల గురించి మరింతగా అనుభవంలోకి వస్తుందని ఓ పరిశోధనలో తేలింది.

7. రిలేషన్‌షిప్‌లో చాలా మంది కోపం వస్తే తమ పార్టనర్‌‌లోని లోపాలను ఎత్తి చూపుతుంటారు. అలా కాకుండా మీలోని లోపాలను అంగీకరించే అమ్మాయి దొరికితే మీ అంత లక్కీ మరొకరు ఉండరు.

Tags :
|
|

Advertisement