Advertisement

శృంగారానికి సరైన సమయం

By: chandrasekar Thu, 03 Sept 2020 09:54 AM

శృంగారానికి సరైన సమయం


దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే శృంగారం చాలా ముఖ్యం. శృంగారం చేయడానికి ఏ సమయం మంచిదో కొంచం తెలుసుకుందామా. శృంగారమంటే రాత్రే చేయాలనే రూల్ ఏమీ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు. కానీ రాత్రిపూట చేసే శృంగారానికి ఉదయం వేళల్లో చేసే శృంగారానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. రాత్రి చేసే శృంగారం వల్ల మంచి నిద్ర, ప్రశాంతత లభిస్తే మార్నింగ్ సెక్స్ వల్ల అంతకంటే ఎక్కువ మజా వస్తుందట.

చాలామందికి వేకువ జామున నిద్ర లేస్తే మళ్ళీ అంత త్వరగా నిద్ర రాదు. అందువల్ల ముఖ్యంగా వేకువజామున సెక్స్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయట. పరిశోధకులు సైతం ఇదే విషయం చెబుతున్నారు. ఉదయం పూట సెక్స్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయని వారు తేల్చి చెప్పారు. మరి, ఆ ప్రయోజనాలేమిటో చూద్దామా!

*వ్యాయామం వలె కనీసం గంటపాటు సెక్స్ చేయడం వల్ల 300 కేలరీల శక్తి ఖర్చవుతుంది. కాబట్టి ఇది మంచి వ్యాయమం కూడా అవుతుంది.

* ఉదయం పూట సెక్స్ చేయడం వల్ల రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు. భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. మంచి ఆనందాన్ని ఇస్తుంది.

* ఉదయం వేళల్లో కండోమ్ లేకుండా సెక్స్ చేస్తారు. దీని వల్ల డిప్రెషన్ తగ్గుతుంది.

* ఉదయం వేళ సెక్స్ చేస్తున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి దూరం చేసి ఉత్సాహంగా ఉంచుతుంది.

* సెక్స్ వల్ల మైగ్రెయిన్ కూడా తగ్గుముఖం పడుతుంది.

* రోజంతా తీరికలేకుండా పని ఒత్తిడితో గడివారు రాత్రిళ్లు సెక్స్‌ను ఆస్వాదించలేరు. వారికి ఉదయమే సరైన వేళ.

* సెక్స్ వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

* రాత్రి నిద్రవల్ల శరీరానికి విశ్రాంతి లభించడం వల్ల తెల్లవారు జామున సెక్సులో యాక్టీవ్‌గా ఉంటారు. ఎక్కువసేపు సెక్స్ చేయగలరు.

* ఉదయం పూట చేసే సెక్స్ వల్ల ముఖంలో వర్ఛస్సు పెరుగుతుంది.

* ఉదయం వేళ సెక్స్ వల్ల డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.

* రాత్రి నిద్ర కారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. దీనివల్ల ఉదయం వేళ ఎక్కువ సేపు శృంగారంలో పాల్గోగలుగుతారు.

సాధారణంగా సెక్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

* శృంగారంలో పాల్గొనడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. మంచి ఆరోగ్యం కూడా.

* శృంగారంలో పాల్గొనడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. టెన్షన్ ఫ్రీ గా వుంటారు.

* తలనొప్పికి సెక్స్ మంచి మందు.

* రెగ్యులర్‌గా సెక్స్ చేసేవారు తక్కువ వయసున్న వారిలా కనిపిస్తారు.

* తరచుగా సెక్స్ చేయడం వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి.

* రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆక్టివ్ గా వుంటారు.

* వారంలో ఒకటి, రెండుసార్లు సెక్స్ చేసే వారిలో ఇమ్యూనిటీ పెరిగినట్లు పరిశోధనల్లో తెలిసింది.

* శృంగారం వల్ల మహిళల్లో కంటి కండరాలు బలోపేతం అవుతాయి. దృడంగా వుంటారు.

* సెక్స్‌లో పాల్గొన్న సమయంలో విడుదలయ్యే హార్మోన్లు మనసుకు చక్కటి ఫీలింగ్‌ను ఇస్తాయి.

* సెక్స్ వల్ల చక్కటి నిద్ర మీ సొంతమవుతుంది.

Tags :
|
|

Advertisement