Advertisement

  • ఈ అయిదు సూత్రాలతో మీ వైవాహిక జీవితాన్ని ఎల్లప్పుడూ ఆనందంగా గడపండి

ఈ అయిదు సూత్రాలతో మీ వైవాహిక జీవితాన్ని ఎల్లప్పుడూ ఆనందంగా గడపండి

By: Sankar Wed, 26 Aug 2020 4:29 PM

ఈ అయిదు సూత్రాలతో మీ వైవాహిక జీవితాన్ని ఎల్లప్పుడూ  ఆనందంగా గడపండి


జీవిత భాగస్వామితో జీవితాంతం ఆనందంగా గడపాలని మీరు అనుకుంటే.. వారు మీకు ఎంత ముఖ్యమో మీరు తెలియజేయాలి. చాలా మంది వారి ఫీలింగ్స్ ని వారిలోనే దాచుకుంటుంటారు..మూడుముళ్లు, ఏడు అడుగులతో ఏర్పడుతుంది పెళ్లి బంధం. పెళ్లయిన తొలి రోజుల్లో భార్యభర్తలిద్దరూ ఒకరితో మరొకరు ప్రేమగానే ఉంటారు. ఒకరి కోసం మరొకరు సమయం కేటాయిస్తూ సరదాగా గడిపేస్తారు.ఆ తర్వాతే మొదలౌతుంది అసలు సమస్య. ఒకరి కోసం మరొకరికి సమయం కేటాయించడం కుదరదు..దీనితో వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి..అయితే వీటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందమా ..

1. ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేయండి..

మీ జీవిత భాగస్వామితో జీవితాంతం ఆనందంగా గడపాలని మీరు అనుకుంటే.. వారు మీకు ఎంత ముఖ్యమో మీరు తెలియజేయాలి. చాలా మంది వారి ఫీలింగ్స్ ని వారిలోనే దాచుకుంటుంటారు.అలా కాకుండా ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయాలి. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ లు చెప్పండి.వాళ్లు మీ పక్కన లేనప్పుడు వాళ్లని ఎంత మిస్ అవుతున్నారో తెలియజేస్తూ ఉండండి.

2. లవ్ మెసేజీలు..

పెళ్లి కుదరిన తర్వాత చాలా మంది ఫోన్లలో చాటింగ్ లు చేసుకుంటూనే ఉంటారు. అందులో ప్రేమ సందేశాలకు కూడా చోటు ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత వీటిని పూర్తిగా తగ్గించేస్తారు. అలా చేయడం కరెక్ట్ కాదు. మీ ప్రేమను మీ పార్టనర్ కి మెసేజ్ ల ద్వారా తెలియజేస్తూ ఉండండి.

3. కౌగిలింత..

కొన్ని మాటల్లో చెప్పలేని ఫీలింగ్స్ ని కౌగిలింతతో చెప్పవచ్చు అంటారు నిపుణులు. కాబట్టి ప్రతి రోజు కనీసం 20నిమిషాల పాటు మీ పార్టనర్ ని హగ్ చేసుకుంటే.. మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది

4. కాంప్లిమెంట్స్..

ఒక మెచ్చుకోలు.. ఎంతో తృప్తిని ఇస్తుంది. వాళ్లు మీకోసం ఏదైనా చేసినా, అందంగా రెడీ అయినా.. కాంప్లిమెంట్స్ ఇవ్వడం, అప్రిషియేట్ చేయడం లాంటివి చేస్తే మీ భాగస్వామికి ఆనందం కలుగుతుంది

5. నిజాయితీ..

అంతేకాదు.. మీ జీవిత భాగస్వామితో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీ మీదే బంధాలు నిలబడతాయి అన్న విషయం గుర్తించుకోవాలి. అదేవిధంగా మీ భాగస్వామి చేసే కొన్ని పొరపాట్లను మీరు మన్నించగలగాలి.





Tags :
|
|

Advertisement