Advertisement

అక్టోబర్ నాటికీ పర్యాటకులకు బాలి సిద్ధంగా ఉంటుంది ..బాలి ప్రభుత్వం

By: Sankar Wed, 03 June 2020 7:59 PM

అక్టోబర్ నాటికీ పర్యాటకులకు బాలి సిద్ధంగా ఉంటుంది ..బాలి ప్రభుత్వం

ప్రపంచ పర్యాటకులు అత్యంత ఇష్టపడే పర్యాటక గమ్యస్థానాల్లో బాలి ఒకటి. ఇక్కడి ప్రకృతి అందాలు, ప్రాచీన వారసత్వ నిర్మాణాలు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఇక్కడ పర్యాటక రంగం మూతపడింది. అయితే అక్టోబర్ 2020 నాటికి బాలి పర్యాటకులను స్వాగతించేందుకు సిద్ధం కానున్నట్లు వార్తలు ఉన్నాయి. తేదీలు ఇంకా ప్రకటించబడనప్పటికీ బాలినీస్ ప్రభుత్వం జూన్ మరియు అక్టోబర్ మధ్య మరోసారి పర్యాటక రంగాన్ని తిరిగి తెరవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇండోనేషియా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ని వయన్ గిరి అడ్న్యాని ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ... వైరస్ కేసులు తగ్గుముఖం పట్టిన యెడల జూన్ మరియు అక్టోబర్ మధ్యలో టూరిజం మంత్రిత్వ శాఖ బాలితో సహా దేశంలోని ఇతర ప్రముఖ పర్యాటక గమ్యస్థానాలను పునరుద్ధరించడంతో పాటు ప్రచార కార్యక్రమాలను కూడా చేపడుతుందని తెలిపారు.

bali,indonesia,tourist,corona,lock down ,బాలి ప్రభుత్వం , ఇండోనేషియా,  వైరస్ కేసులు, అక్టోబర్, బాలి

బాలికు చెందిన మరో అధికారి మాట్లాడుతూ... ప్రభుత్వ చర్యలతో వైరస్ వ్యాప్తిని నిరోధించడంతో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గించగలిగితే జూలైలోనే బాలిని తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. ఇండోనేషియాలోని ఇతర ప్రాంతాల కంటే బాలి త్వరగా తెరుచుకునే అవకాశం ఉన్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతానికి బాలి అధికారికంగా ఇండోనేషియా ప్రజల కోసం దేశీయ టూరిజంను తెరిచింది. బాలిను సందర్శించాలనుకునే పర్యాటకులు ముందుగా కరోనా వైరస్ పరీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో నెగిటివ్ గా తేలిన వారికి హెల్త్ సర్టిఫికేట్ ను అందజేస్తారు. ఈ ధృవీకరణ పత్రం ఉన్నవారిని మాత్రమే పర్యటనకు అనుమతిస్తారు. కొద్ది రోజుల క్రితమే బాలి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.


Tags :
|
|

Advertisement