అధికార యంత్రాంగం వైఫల్యంపై గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు
By: Sankar Thu, 31 Dec 2020 11:37 PM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఈ లేఖతో పాటు రెండు వీడియోలను సాక్ష్యాధారాలుగా పంపారు చంద్రబాబు.
ఏపీలో అధికార యంత్రాంగం వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యకం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు భారీగా పెరిగిపోయాయని... కొందరు పోలీసులు అధికార నాయకులతో కుమ్మక్కయ్యారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడికి పాల్పడ్డారని... ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం వేధిస్తోందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. ఇప్పటికైనా గవర్నర్ జోక్యం చేసుకుని... ఏపీలో పాలనను చక్కదిద్దాలని.. జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి రక్షణ కల్పించాలని లేఖలో చంద్రబాబు కోరారు.