Advertisement

ఈ రెండు రోజుల్లో ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ

By: Sankar Thu, 31 Dec 2020 11:10 PM

ఈ రెండు రోజుల్లో ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ


కరోనా వైరస్‌కు టీకా రావడంతో దేశ ప్రజలంతా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. మహమ్మారిని అరికట్టేందుకు మందు రావడంతో ఇక న్యూ ఇయర్‌ వేడుకలను వైభవంగా జరపుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేశ రాజధాని ప్రజలకు చేదు అనుభవం ఎదురైంది.

డిసెంబర్‌ 31, రాత్రి, జనవరి 1 తేదీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆప్‌ ప్రభుత్వం ప్రభుత్వం‌ ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. బ్రిటన్‌ కొత్త స్ట్రైయిన్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక రాత్రి కర్ఫ్యూ సమయంలో ఎవరూ కూడా కొత్త సంవత్సరం వేడుకలను ఇళ్ల బయట జరుపుకోకూడదని, బహిరంగ స్థలాల్లో గుంపులుగా ఉండటం, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది

Tags :
|

Advertisement