ట్రంప్‌కు కరోనా వల్ల బంగారం ధర మళ్లీ పైకి కదిలే అవకాశముందన్న నిపుణులు
By: chandrasekar Sat, 03 Oct 2020 11:31 AM
అగ్ర రాజ్యమైన అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ట్రంప్‌కు కరోనా సోకడం వల్ల
బంగారం ధర మళ్లీ పైకి కదిలే అవకాశముందని నిపుణులు తెలిపారు. బంగారాన్ని
సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చూస్తారు. అందుకే పసిడి ధర ప్రతికూల
పరిస్థితుల్లో పరుగులు పెడుతూ వస్తుంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న
తరుణంలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. ఆగస్ట్ నెలలో ఏకంగా కొత్త రికార్డ్ స్థాయికి
చేరింది. అందుకే చాలా మంది బంగారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కరోనా వైరస్ కారణంగా
లాక్ డౌన్ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు పసిడి ధర భారీగానే
తగ్గింది. ట్రంప్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి.
అందువల్ల బంగారం పై దీని ప్రభావం పడే అవకాశం వుంది.
ప్రస్తుతం ఆగస్ట్ నెల
గరిష్ట స్థాయితో పోలిస్తే బంగారం ధర రూ.5,000కు
పైగా పడిపోయింది. అలాగే కేవలం సెప్టెంబర్ నెల వరకు మాత్రమే చూస్తే బంగారం ధర
దాదాపు రూ.1,500
పతనమైంది. బంగారం ధర గత నెలలో తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ బలపడటం. అలాగే స్టాక్
మార్కెట్లు కూడా పరుగులు పెట్టడంతో కూడా బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. అయితే
ఇప్పుడు బంగారం ధర భారీగా పెరిగే అవకాశముంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా వైరస్ పాజిటివ్ రావడం ఇందుకు ప్రధాన కారణం. ట్రంప్‌కు
కరోనా వస్తే బంగారం ధర ఎందుకు పెరుగుతుందని ఆలోచిస్తున్నారా? డోనాల్డ్ ట్రంప్ కి కోవిడ్ 19 సోకడంతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ఎఫెక్ట్
ఇతర దేశాల స్టాక్ మార్కెట్లపై కూడా పడుతుంది. ఈక్విటీ మార్కెట్లు పడిపోవడంతో
ఇన్వెస్టర్లు వారి డబ్బులను మార్కెట్ల నుంచి తీసేసి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు.
దీంతో బంగారం ధర మళ్లీ పైకి కదిలే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.