Advertisement

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా మారలేదు...!

By: Anji Tue, 15 Dec 2020 2:24 PM

పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా మారలేదు...!

గత కొద్ది రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు నేడు కూడా మారలేదు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.06 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.80.60 పైసలుగా ఉంది.

డిసెంబర్ 7 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. డిసెంబర్ నెలారంభంలో పెట్రోల్ ధరలు పత్రి రోజూ పెరిగాయి.

నవంబర్ 30న రూ.85.64 పైసలు ఉన్న పెట్రోల్ ధర.. డిసెంబర్ 7 నాటికి రూ.87 దాటింది. డీజిల్ ధర సైతం ఇదే విధంగా పెరిగి రూ.80 దాటింది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.44 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.82.54 పైసలుగా ఉంది. ఏపీ సర్కారు విధించిన పన్నుల కారణంగా తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రాలో పెట్రో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.71 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.73.87 పైసలుగా ఉంది. ముంబైలో గరిష్టంగా లీటర్ పెట్రోల్ ధర రూ.90.34 పైసలు ఉండగా.. డిజిల్ ధర రూ.80.51 పైసలు ఉంది.

లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్ ఆరంభంలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.97 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.67.82 పైసలు ఉండేది.

జూన్ 1 వరకు ఇదే ధరలు కొనసాగాయి. కానీ లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తేశాక.. అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ ఏర్పడింది.

దీంతో జూలై 1 నాటికి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.83.49 పైసలకు చేరింది. డీజిల్ ధర రూ.78.69 పైసలకు చేరింది.

Tags :
|

Advertisement