Advertisement

  • అత్యధిక పోషక విలువలు, బోలెడన్ని ఔషధగుణాలు కలిగిన నువ్వులు .

అత్యధిక పోషక విలువలు, బోలెడన్ని ఔషధగుణాలు కలిగిన నువ్వులు .

By: chandrasekar Wed, 27 May 2020 10:58 AM

అత్యధిక పోషక విలువలు, బోలెడన్ని ఔషధగుణాలు కలిగిన నువ్వులు  .


నల్ల నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. అత్యధిక పోషక విలువలు, ఎన్నోరకాల ఔషధగుణాలను అందించే నూనెగింజల్లో నువ్వులు ప్రధానమైనవి. అందుకే మన రోజువారీ ఆహారంలో తరచుగా నువ్వులు ఉండేలా చూసుకోవాలి. నువ్వుల్లో పుష్కలంగా లభించే ప్రొటీన్లు తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణ సమస్యలను దూరం చేసి తిన్న హారం ఒంటికి పట్టేలా చేసే గుణం నువ్వులకు ఉంది. నువ్వుల నూనె క్యాన్సర్‌ను అడ్డుకోవటంతో బాటు పలు చర్మ వ్యాధుల్ని చేరనివ్వదు. నువ్వుల్లో జింక్‌ చర్మకాంతిని పెంచుతుంది. మద్యపానం చేసేవారిలో తలెత్తే కాలేయ సమస్యలకు నువ్వుల వినియోగం మంచిది. నువ్వుల నూనె కురులకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలకుండా చూస్తుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.

sesame seeds,high nutritional value,many medicinal properties,health,people ,అత్యధిక, పోషక విలువలు, బోలెడన్ని ఔషధగుణాలు, కలిగిన నువ్వులు, జుట్టు


నువ్వుల్లోని మెగ్నీషియం అధిక రక్తపోటును, నువ్వుల్లోని నూనె మధుమేహాన్ని నియంత్రిస్తాయి. నువ్వులోని ప్రత్యేక పోషకాలు మానసిక ఒత్తిళ్లను తగ్గించి సుఖనిద్రకు దోహదం చేస్తాయి. నువ్వుల వినియోగంతో రక్తంలో చేరిన అధిక కొవ్వు వదిలిపోయి హృద్రోగాల ముప్పు తగ్గుతుంది. మేలైన నేత్ర ఆరోగ్యం కోరుకొనేవారంతా నువ్వులు వాడాలి. వయసురీత్యా వచ్చే నేత్ర సమస్యలను ఆలస్యం చేయటంలో నల్ల నువ్వుల వినియోగం ఎంతో దోహదం చేస్తుంది. నల్ల నువ్వుల్లో ఉండే అధిక ఐరన్ నిల్వల మూలంగా రక్తహీనత వంటి సమస్యలు దరిజేరవు. నల్ల నువ్వులు, బెల్లం కలిపి తింటే కాల్షియం లోపాలు తొలగి ఎముకలు బలంగా మారతాయి.

Tags :
|

Advertisement