Advertisement

  • వీటిని తినడం వల్ల స్త్రీ లలో ఆ లోపం లేకుండా పోతుంది...!

వీటిని తినడం వల్ల స్త్రీ లలో ఆ లోపం లేకుండా పోతుంది...!

By: Anji Sat, 26 Dec 2020 4:00 PM

వీటిని తినడం వల్ల స్త్రీ లలో ఆ లోపం లేకుండా పోతుంది...!

అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.


తామర, సోరియాసిస్ లేదా బొల్లి మరియు ఇతర చర్మ వ్యాధుల తగ్గుదలకు ఉపయోగపడతాయిపొడి చర్మం కూడా సోరియాసిస్ మరియు తామర వంటి ఇతర చర్మ వ్యాధులకు కారణమవుతుంది. ఇవన్నీఅవిసె గింజల ద్వారా నిరోధించబడతాయి.


అవిసె గింజల నూనెను చర్మంపై మర్దన చేయవచ్చు లేదా అవిసె గింజలను ప్రతీ రోజూ తినవచ్చు. ఏది చేసినా కూడా ప్రయోజనం కలుగుతుంది. వీటి యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా చర్మానికి చికిత్స చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కాన్సర్ ను కూడా నిరోధించడానికి సహాయపడతాయి.


వయసు వల్ల ముఖంపై వచ్చే ముడతలను తగ్గిస్తుంది:
ఒక టీస్పూన్ అవిసె గింజల నూనెకు రెండు టేబుల్ స్పూన్ల ముడి తేనె, ఒక టీస్పూన్ తాజా నిమ్మరసం కలిపి ముఖంపై రోజూ ఉదయాన్నే ఫేస్ ప్యాక్ లాగా వేయాలి. దీనివల్ల చర్మం పై ముడతలు పోతాయి మరియు చర్మం మెరుస్తుంది.


అవిసె గింజలను స్క్రబ్ లా కూడా వాడవచ్చు. అవిసె గింజల పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనెలో కలిపి మొహానికి పట్టించి బాగా రుద్ది పదినిమిషాలపాటు వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మ రంధ్రాలు తెరుచుకొని చర్మం తాజాగా మారుతుంది.

Tags :

Advertisement