అత్యాధునిక ఫీచర్లు ఉన్న "పోకో M2 Pro" స్మార్ట్ ఫోన్
By: chandrasekar Thu, 09 July 2020 3:47 PM
ప్రముఖ స్మార్ట్ ఫోన్
బ్రాండ్ పోకో సరికొత్త, అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఫోన్ ను విడుదల చేసింది.
"పోకో m2 pro" పేరుతో
రూపొందించింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్కవైపు అందించారు.
వెనకవైపు నాలుగు కెమెరాలు, కెమెరా
సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా
వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ + 5 మెగా
పిక్సెల్ మాక్రో షూటర్ లు ఉన్నాయి.
ఫ్రన్ట్ సైడ్16
మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు బ్యాటరీ సామర్థ్యం 5,000
ఎంఏహెచ్ గా ఉంది. పోకో m2 pro మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999.అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్, టూ షేడ్స్ ఆఫ్ బ్లాక్
రంగుల్లో అందుబాటులో ఉంది. లోకల్ టు గ్లోబల్ వార్త ఏదైనా అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే
తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.