Advertisement

మెలనిన్ ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు

By: chandrasekar Fri, 19 June 2020 4:27 PM

మెలనిన్ ఎక్కువగా ఉండే ఉల్లిపాయలు


ఉల్లిపాయలు కంటనీరు తెప్పిస్తాయేగానీ వాటి లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్‌లను తరిమికొట్టే గుణాలు చాలా ఉన్నాయి. జుట్టు ఊడిపోయేవారికి ఉల్లిపాయలు దివ్యౌషధం.

ఎందుకంటే అవి మన జుట్టు కుదుళ్లను ఒత్తుగు, బలంగా అయ్యేలా చేస్తాయి. చుండ్రుకు చెక్ పెడతాయి. ఉల్లిలో ఉండే సల్ఫర్ జుట్టు చిట్లిపోవడాన్నీ, సన్నగా అయిపోవడాన్నీ అడ్డుకుంటుంది. ఎక్కువగా జుట్టు రాలిపోతున్నవారు ఉల్లిపాయలతో అద్భుత ప్రయోజనాన్ని పొందగలరు. జుట్టు తెల్లగా అయిపోతుంటే వెంటనే ఉల్లిపాయల్ని ప్రయోగించడం మేలు. ఎందుకంటే వెంట్రుకల గొట్టాల్లో ఉండే మెలనిన్‌ను (ఈ మెలనిన్ లేకపోతే వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి) తిరిగి నింపడంలో ఉల్లిపాయలు ది బెస్ట్.

జుట్టులో పేలను తరిమికొట్టే సహజ లక్షణాలు కూడా ఉల్లికి ఉన్నాయి. ఉల్లికి రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలున్నాయి. ఇది కూడా జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది. కాబట్టి ఆందోళనలూ, టెన్షన్లూ అన్నీ పక్కన పెట్టి ఉల్లిపాయల్ని తెచ్చుకోండి.

melanin,rich,onions,hair,growth ,మెలనిన్, ఎక్కువగా, ఉండే, ఉల్లిపాయలు,  జుట్టు


* రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకోండి.
* ఉల్లిపాయల తొక్కలు తీసి వాటిని నాలుగు భాగాలుగా కోయండి.
* జ్యూసర్ లేదా గ్రైండర్‌లో వాటిని గుజ్జుగా చెయ్యండి.
* కొద్దిగా నీరు పొయ్యండి. ఇప్పుడు గుజ్జును బాగా కలిపి ఫిల్టర్ చెయ్యండి.
* ఇప్పుడు చక్కటి ఆనియన్ జ్యూస్ (రసం) వచ్చినట్లే.
* ఆ రసాన్ని జుట్టుకి బాగా పట్టించండి.
* మీ చేతి వేళ్లతో మెల్లగా, స్మూత్‌గా మసాజ్ చెయ్యండి. అన్ని వెంట్రుకలకూ ఆ రసం చేరాలి. ఓ గంట పాడూ ప్రశాంతంగా కూర్చోండి.
* ఇప్పుడు తేలికపాటి షాంపూతో జుట్టును స్లోగా కడిగేయండి.
* ఇలా చెయ్యకపోతే, ఉల్లిపాయల వాసన అలాగే ఉంటుంది. అందువల్ల మంచి స్మెల్ ఉండే షాంపూ వాడాలి.
* ఇలా మీరు వారానికి ఓసారి చెయ్యాలి. ఇలా రెండు నెలలు చేసి చూడండి. మీకే డిఫరెన్స్ కనిపిస్తుంది.

Tags :
|
|
|

Advertisement