Advertisement

అల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..

By: Sankar Sun, 19 July 2020 3:28 PM

అల్లంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..



వంటింట్లో వున్న ఔషదాల్లో ఒక గొప్ప ఔషదం అల్లం. ఎన్నో ఆరోగ్య సమస్యలకి వంటింట్లో వున్న ఈ దివ్య ఔష్యదంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు..అయితే అల్లం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూదాం ..

1. అల్లంలో ఉండే ఔషద గుణాలు పొట్టలో వున్న గ్యాస్‌ని బయటికి పంపించేయడానికి ఉపయోగపడతాయి. ఫలితంగా పొట్ట ఉబ్బరం, నొప్పి నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది.

2. శీతాకాలంలో జలుబు బారిన పడకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు అల్లం బాగా ఉపయోగపడుతుంది. చిన్న ముక్కలుగా తరిమిన ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలని రెండు కప్పుల నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరగపెట్టాలి. అల్లంతో కాచిన ఈ నీళ్లు వేడి తగ్గిన తర్వాత కొన్ని తేనే చుక్కలు అందులో కలుపుకుని సేవించాలి. అప్పుడప్పుడు ఇలా అల్లంతో కాచిన నీటిని రోజులో రెండు లేదా మూడుసార్లు సేవిస్తే, జలుబు దరిచేరదు.

3. శీతాకాలంలో చెడిన పాదాలకి అల్లం మంచి ఔషదం. బాగా మరిగిన నీటిలో అల్లం ముక్కలు వేసి, నీళ్లు గోరువెచ్చగా వున్నప్పుడే అందులో 15 నిమిషాలపాటు పాదాలని పెట్టివుంచితే, పాదాలు చెడిపోకుండా వుంటాయి.

4. ఒక టేబుల్ స్పూన్ తేనేలో కొన్ని అల్లం రసం చుక్కల్ని వేసి ఓ మిశ్రమంగా కలిపి తీసుకుంటే, జలుబు, దగ్గు హుష్‌కాకి అవుతాయి. రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఇలా చేయాలి.

5. వివిధ రకాల నొప్పులకి అల్లం ఒక దివ్యమైన ఔషదంగా పనిచేస్తుంది. మీరు రోజూ తీసుకునే ఆహారంలో అల్లం మిశ్రమాన్ని తీసుకుంటే ప్రయోజనం కనిపిస్తుంది. లేదా వేడి నీటిలో అల్లం, నిమ్మరసం, తేనే మిశ్రమాలు కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.

Tags :
|
|
|
|

Advertisement