Advertisement

  • ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు

ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు

By: Sankar Thu, 06 Aug 2020 4:53 PM

ఉప్పు కలిపిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు



ఎవ‌రికైనా క‌డుపు నొప్పి వ‌చ్చిన‌ప్పుడు సాల్ట్ క‌లిపిన నీరు తాగితే త‌గ్గిపోతుంది. దీనికి మెడిసిన్ కూడా అవ‌స‌రం లేదు. సాల్ట్ వాట‌ర్‌తో ప్ర‌యోజ‌నాలుంటాయ‌ని చాలామందికి తెలియ‌దు. జుట్టు, చ‌ర్మం, నోరు అన్నింటికీ ఎంతో మేలు చేస్తుంది. మంచిదే క‌దా అని ఎక్కువ‌గా తాగినా అన‌ర్థాలున్నాయి. అందుకే చెడుని తొల‌గించి మంచిని ఎలా పొందాలో తెలుసుకుందాం.

1. సాల్ట్ వాట‌ర్ తాగ‌డం వ‌ల్ల పొట్ట‌, పేగులు, పెద్ద పేగు వంటివి క్లీన్ అవుతాయి. సాల్ట్ ఎక్కువ‌గా వాడితే ర‌క్త‌పోటు, ర‌క్త ప్ర‌వాహాన్ని కంట్రోల్ దాటిపోతాయి. ప్ర‌మాదానికి గుర‌వుతారు.

2. సోడియం, క్లోరైడ్ క‌లిసిన ద్ర‌వాన్ని సాల్ట్ వాట‌ర్ అంటారు. సోడియం అనేది అత్య‌వ‌స‌ర‌మైన ఖ‌నిజం. దీనివ‌ల్ల శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మంగా ఉండేలా చేస్తాయి. కండ‌రాలు, నాడీ వ్య‌వ‌స్థ చ‌క్క‌గా ప‌నిచేసేస్తుంది.

3. ఉప్ప నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించ‌డం వ‌ల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివ‌ల్ల బ్యాక్టీరియా తొలిగిపోతుంది. నోటి స‌మ‌స్య‌లు ఏవైనా వ‌స్తే ధ‌ర ఎక్కువ‌గా ఉన్న పేస్టులు వాడ‌మ‌ని స‌ల‌హాలిస్తుంటారు. దానికి బ‌దులు సాల్ట్ వాట‌ర్ పుక్కిలిస్తే స‌రిపోతుంది.

4. ఎండ‌లో ఎక్కువ‌గా ప‌నిచేసేవారి శ‌రీరం డీహైడ్రేట్‌కు గుర‌వుతుంది. చెమ‌ట ఎక్కువ‌గా పోసి ఒక‌సారిగా ఎండిపోతే చ‌ర్మంపైన తెల్ల‌గా ఉప్పులా క‌నిపిస్తుంది. అది అచ్చం సాల్ట్‌లానే ఉంటుంది. శ‌రీరంలోని ఉప్పంతా ఇత‌ర మార్గాల ద్వారా బ‌య‌ట‌కు వెళ్తుంది. అందుక‌ని సాల్ట్ వాట‌ర్‌లో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగితే శ‌రీరం మ‌ళ్లీ హైడ్రేటింగ్‌కు వ‌స్తుంది.

5. జ‌న‌ర‌ల్‌గా ప‌ల్లెటూళ్లో ఉండేవాళ్లు పొలాల్లోకి వెళ్లిన‌ప్పుడు అక్క‌డున్న బావులో మునిగి వ‌స్తుంటారు. సిటీలో వీలైతే స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతారు. పిల్ల‌ల‌కు అయితే బాత్ ట‌బ్ వాడుతుంటారు. అందులో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిలో జ‌ల‌కాలాడితే.. స్వ‌ర్గంలో తేలిన‌ట్లే ఉంటుంది.ఈ నీరు చ‌ర్మానికి ఎంతో మేలు ఏస్తుంది. క‌ళ్ల‌లో మంట కూడా త‌గ్గుతుంది.

Tags :
|
|
|

Advertisement