Advertisement

  • గ్రీన్ టీ ఎక్కువగా ఎందుకు తీసుకోకూడదో తెలుసా?

గ్రీన్ టీ ఎక్కువగా ఎందుకు తీసుకోకూడదో తెలుసా?

By: chandrasekar Thu, 15 Oct 2020 09:32 AM

గ్రీన్ టీ ఎక్కువగా ఎందుకు తీసుకోకూడదో తెలుసా?


గ్రీన్ టీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గ్రీన్ టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది అని చాలా మంది చెప్పడం మనం విన్నాం. కానీ దాని వల్ల ఎంత నష్టం కలుగుతుంది అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఆరోగ్యం కోసం జిమ్ కి వెళ్లేవాళ్లకు గ్రీన్ టీ మరింత మంచిది. కానీ దాన్ని ఎప్పుడు ఎలా తాగాలి అనేది మాత్రం చాలా మందికి తెలియని విషయం. గ్రీన్ టీని ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.

* గ్రీన్ టీలో 25 నుంచి 25 మిల్లీగ్రాముల వరకు కెఫెన్ ఉంటుంది. రోజుకు 4 లేదా 5 సార్లు తాగడం వల్ల మీ శరీరంలోకి కెఫెన్ అధికంగా చేరుతుంది. దీని వల్ల నిద్రలేమి, నీరసం, వ్యాకులత కలిగే అవకాశం ఉంది.

* గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. దీని వల్ల యాసిడిటీ సమస్య వస్తుంది.

* గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు పటుత్వం కోల్పోతాయి. శరీరంలోని క్యాల్షియం పనికి గ్రీన్ టీ ఆటంకం కలిగిస్తుంది.

* చాలా మంది గ్రీన్ టీని రెగ్యులర్ టీలాగే తాగుతారు. అలా చేయడం మానేయాలి. ఆహారంతో పాటు గ్రీన్ టీని తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. అందుకే గ్రీన్ టీ తీసుకోవాలి అనుకుంటే ఐరన్ ఉన్న ఆహారం తీసుకోండి.

* మందులతో పాటు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. రక్తపోటును కూడా పెంచే అవకాశం ఉంది.

* గర్భవతి మహిళలు, పాలిచ్చే తల్లులు గ్రీన్ టీ తాగకపోవడం శ్రేయస్కరం. అది పిల్లలకు హానికలిగిస్తుంది అని కొన్ని పరిశోధనల్లో తేలింది.

Tags :
|

Advertisement