బ్రేక్‌ఫాస్ట్ తినకుండా అసలు ఉండకూడదు
By: chandrasekar Fri, 17 July 2020 5:52 PM
రోజును ఉత్సాహంగా
ప్రారంభించాలంటే బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఉదయం
బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తే లేనిపోని రోగాలన్నీ వస్తాయి. కానీ ఈ బిజీ లైఫ్‌లో
తీరిక లేక చాలామంది అల్పాహారం తినడం మానేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం
దెబ్బతింటుంది. బ్రేక్‌ఫాస్ట్ తినకుంటే జరిగే అనర్థాలు గురించి తప్పకుండా
అందరూ తెలుసుకోవాలి.
* బ్రేక్‌ఫాస్ట్ తినకుంటే మెదడు కూడా
మొద్దుబారిపోతుంది. అల్పాహారం మెదడుకు గ్లూకోజ్‌గా పనిచేస్తుంది. తినకపోవడం వల్ల
పని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది.
* అల్పాహారం తీసుకోకపోతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్
పెరిగిపోతుంది. ఎక్కువగా బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
* బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే మధుమేహం వచ్చే అవకాశాలు
ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరుగడానికి కారణమవుతుంది. ఈ సమస్యలతో
గుండెపోటుకు దారితీస్తుంది.
* బ్రేక్‌ఫాస్ట్ తినేటప్పుడు రోజుకో సమయం కాకుండా
ప్రతిరోజూ ఒక సమయాన్నే ఫాలో అవ్వాలి. లేదంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.
* ముఖ్యంగా మహిళలు బ్రేక్‌ఫాస్ట్ తినకుండా అసలు ఉండకూడదు.
ఇలా చేయడం వల్ల నెలసరి సరిగ్గా రాకపోవడం లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని
ఓ సర్వేలో తేలింది.