Advertisement

విటమిన్ 'సి' ఉన్న నిమ్మ వల్ల కలిగే లాభాలు

By: chandrasekar Thu, 18 June 2020 7:39 PM

విటమిన్ 'సి' ఉన్న నిమ్మ వల్ల కలిగే లాభాలు


కరోనా వైరస్ బారిన పడకుండా ఇమ్మ్యూనిటి పవర్ ని పెంచుకోవడానికి నిమ్మ చాలా ఉపయోగకరం. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న కరోనా వైరస్ నుండి రక్షించే వ్యాక్సిన్ రావడానికి కనీసం మరో 6 నెలలు పట్టేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచుకోవాల‌ను వైద్యులు చెబుతున్నారు. విటమిన్ 'సి' లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందులో నిమ్మ‌కాయ ముందుంటుంది. లెమ‌న్ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల చాలా ఉప‌యోగాలున్నాయి. శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ ను కరిగించడంలో అధిక ప్రాధాన్యత కలిగివుంది.

నిమ్మరసం త్రాగడం వల్ల కలిగే ఉపయోగాలు:

* ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది.

* నిమ్మకాయ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయదు. నిమ్మలో దొరికినంత సి విటమిన్ పండ్లలోనూ లభించదు.

* పంటినొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నిమ్మ‌ర‌సం నియంత్రిస్తుంది.

* శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయంలో పేరుకున్న విషపదార్థాలను సైతం నిమ్మకాయ తొలగిస్తుంది. కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.

benefits,lemon,containing,vitamin c,health ,విటమిన్, ఉన్న, నిమ్మ, వల్ల , కలిగే లాభాలు


* కొన్నిసార్లు పొరపాటున కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే వెంటనే వారికి నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది.

* బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసంతో బాటు తేనె కలుపుకొని తాగుతారు.

* కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారణంగానే నిమ్మరసం తాగాలని వైద్యులు తరచుగా సూచిస్తుంటారు.

* వేసవి ఎండలో చల్లని నిమ్మ రసం వుతేజాన్నిస్తుంది.

Tags :
|

Advertisement