Advertisement

అల్బుక‌రా పండ్లు వల్ల కలిగే లాభాలు

By: chandrasekar Tue, 23 June 2020 6:40 PM

అల్బుక‌రా పండ్లు వల్ల కలిగే లాభాలు


క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. లేదంటే అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా ఉంచేందుకు అల్బుక‌రా పండ్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి.

* ఆల్బుక‌రాలో ఉండే విటమిన్ కె ఎముక‌లను దృఢంగా ఉంచుతుంది. అంతేకాదు అల్జీమ‌ర్స్‌ను న‌యం చేయ‌డానికి ఆల్బుక‌రా పండ్లు ఎంతో తోడ్ప‌డుతాయి.

* ప్ర‌తిరోజూ ఈ పండ్లు సేవించ‌డం వ‌ల్ల మోనోపాజ్ ద‌శ దాటిన మ‌హిళ‌ల్లో క‌నిపించే ఆస్ట్రియోపోరోసిస్‌ని కూడా ఇవి నివారిస్తాయి.

* జీర్ణ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవాళ్లు ఆల్బుక‌రా పండ్లు తింటే జీర్ణ‌శ‌క్తి మెరుగ‌వుతుంది.

* త‌ర‌చూ ఆల్బుక‌రా పండ్లు తిన‌డం వ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

* ఇందులో ఉండే విట‌మిన్లు క‌ణాలు దెబ్బ‌తిన‌కుండా చేస్తాయి.

* ఆల్బుక‌రా పండ్ల‌ను రోజుకు ప‌ది చొప్పున తీసుకుంటే ఎలా స‌మ‌స్య‌లు ద‌రిచేర‌వు.

* ఆల్బుక‌రా పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది.

* ఇందులో విట‌మిన్ ఎ కూడా పుష్కలంగా దొరుకుతుంది. ఇది కంటిచూపును మెరుగుప‌రుస్తుంది.

* ఈ పండ్లు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డ‌మే కాదు చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌కుండా కాపాడుతుంది.

* ఇవి క్యాన్స‌ర్ క‌ణాల‌తో పోరాడ‌డ‌మే కాకుండా గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంది.

Tags :
|

Advertisement