అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ఇంటికే ‘ఆరోగ్యలక్ష్మి
By: chandrasekar Mon, 03 Aug 2020 5:15 PM
అంగన్‌వాడీల్లో ఆహారం
వండి వడ్డించకుండా బియ్యం, కందిపప్పు, నూనె, గుడ్లు, పాలు, కూరగాయలు, గోధుమపిండిని అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటికి వెళ్లి
అందిస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలను
కాపాడేందుకు ప్రభుత్వం పోషకాహారాన్ని ఇంటికే పంపిస్తున్నది. ఆరోగ్యలక్ష్మి పథకం
కింద గర్భిణులు, బాలింతలు, ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు పిల్లలు, మూడు
నుంచి ఆరేండ్లలోపు చిన్నారులకు ప్రత్యేకంగా పోషకాహారం అందిస్తున్నారు. ఈ పథకం కింద
మార్చిలో 19,96,134 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.
మార్చిలో నెలలో లాక్‌డౌన్
ప్రారంభమైన 23 నుంచి ఇండ్లవద్దకే సరుకులను మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ
ఆధ్వర్యంలో ఇంటికే పంపుతున్నారు. మొదట వారానికోసారి సరుకులు పంపిణీ చేశారు. మే నెల
నుంచి ప్రతి 15 రోజులకోసారి అందజేస్తున్నారు. జూలైలో ఒకేసారి 25
రోజులకు సరిపడా సరుకులను పంపిణీచేశారు. నవజాత శిశువులకు టీకాల కార్యక్రమాన్ని, గర్భిణులకు
మందుల పంపిణీల విషయాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంగన్‌వాడీ
సిబ్బందికి సూచనలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో వాట్సాప్‌గ్రూప్ ఏర్పాటుచేశారు.