Advertisement

తమలపాకుల వలన కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

By: Sankar Sun, 16 Aug 2020 12:23 PM

తమలపాకుల వలన కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు


సాధారణంగా శుభకార్యాల్లో తాంబూలంగా ఇచ్చే తమలపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఎముకలు గట్టి పడేందుకు కావాల్సిన కాల్షియంతో పాటు ఫోలిక్ యాసిడ్స్ తమలపాకులో ఎక్కువగా ఉంటాయి..కాస్త లేతగా ఉండే తమలపాకులను కాసేపు నుదుటిపై పెట్టుకోండి. ఆటోమేటిక్ గా తలనొప్పి తగ్గిపోతుంది.

1. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం కూడా తమలపాకుకు ఉంటుంది. త్వరగా వృద్ధాప్యపు చాయలు కనిపించకుండా ఉండాలంటే తమలపాకులు తింటూ ఉండండి. ఇందులో ఎస్సెన్షియల్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అది ఫంగస్ రాకుండా చేయగలదు.

2. బోధకాలు వ్యాధితో బాధపడేవారురోజూ కొన్ని తమలపాకుల్ని కాస్త ఉప్పు వేసి దంచినట్లుగా చేసి ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుని తాగితే మంచింది. దీంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.

3. అధిక బరువును తగ్గించేందుకు కూడా తమలపాకులు బాగా ఉపయోగపడతాయి. రోజూ ఒక ఆకును కొన్ని మిరియాలతో కలపి తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అది తిన్న వెంటనే చల్లనీళ్లు తాగాలి.

4. బాగా తలనొప్పితో ఇబ్బంది పడుతుంటే కాస్త తమలపాకు రసాన్ని ముక్కులో వేసుకోండి. వెంటనే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.

5. చుండ్రు ఎక్కువగా ఉంటే తమలపాకులను మెత్తగా నూరుకుని ఆ మిశ్రమాన్నితలకు పట్టించండి. తర్వాత స్నానం చేయండి. చుండ్రు పోతుంది.

6.మోకాలి నొప్పులు దూరం కావాలంటే తమలపాకుల రసం తాగుతూ ఉండండి.

అయితే తమలపాకు తొడిమలు తినడం వలన సంతానం కలగకపోవచ్చు ..అందుకే తమలపాకులో తొడిమెలను మాత్రం తినకుండా ఉండటానికి ప్రయత్నించండి..






Tags :

Advertisement