ఏడున్నర కోటిపైగా విలువ చేస్తున్న టిక్‌టాక్ యాప్
By: chandrasekar Wed, 27 May 2020 1:31 PM
కరోనా లాక్‌డౌన్‌తో ఇప్పుడు చాలా
మంది టిక్ టాక్, గేమింగ్, వీడియో
స్ట్రీమింగ్ సర్వీసులతో గడిపేస్తున్నారు. టిక్ టాక్‌ను ఎప్పుడూ
వాడని వారు సైతం ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ఎంజాయ్ చేస్తున్నారు. టిక్‌టాక్ ఓనర్ బైట్‌డ్యాన్స్
కూడా తన సంపదను అలాగే పెంచుకుంటూ ఫుల్ ఖుషీ అవుతోంది. బైట్‌డ్యాన్స్ లిమిటెడ్ వాల్యుయేషన్ ప్రైవేట్ మార్కెట్లలో
ఇటీవల 30 శాతానికి పైగా పెరిగి, 100 బిలియన్ డాలర్ల మార్కు(రూ.7,55,330 కోట్లు)ను దాటేసింది. దీని వాల్యుయేషన్ 100 బిలియన్ డాలర్లు దాటడంతో,
ప్రపంచంలోనే మోస్ట్
వాల్యుబల్ స్టార్టప్‌గా బైట్‌డ్యాన్స్ నిలిచింది.
రెండేళ్ల క్రితం
అప్పటి ఫండింగ్ రౌండ్‌లో దీని వాల్యు 75 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇప్పుడు దీని వాల్యు మరో 33 శాతానికి పైగా పెరిగిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. ట్రేడర్లు బైట్‌డ్యాన్స్
వాల్యును సెకండరీ మార్కెట్లలో 105 బిలియన్ డాలర్ల నుంచి 110 బిలియన్ డాలర్లుగా లెక్కకడుతున్నట్టు చెప్పారు. 140 బిలియన్ డాలర్ల వద్ద దీని వాల్యు ట్రేడవుతున్నట్టు మరికొందరు అంటున్నారు.
ఇలా ఏ లెక్కన
చూసుకున్నా బైట్‌డ్యాన్స్ వాల్యు 100 బిలియన్
డాలర్లను దాటేసింది. సెకండరీ మార్కెట్‌లో స్టాక్ వాల్యును ప్రైమరీ
షేర్లకు డిస్కౌంట్‌లో లెక్కిస్తారు. కంపెనీ పర్‌ఫార్మెన్స్‌కు
సంబంధించి కొన్ని ఫైనాన్సియల్ వివరాలు ఇన్వెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
బైట్‌డ్యాన్స్
ఫ్యామిలీ యాప్స్ డౌయిన్, టిక్ టాక్ చైనీస్ ట్విన్, న్యూస్ సర్వీస్ టౌషియోలు 150 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను సొంతం
చేసుకున్నాయి. యూజర్లు పెరుగుతుండటంతో, ఇన్వెస్టర్లు
కూడా ఈ కంపెనీపై తెగ ఆసక్తి చూపుతున్నారు. ఓ వైపు అమెరికన్ చట్ట సభ్యులు ఈ యాప్‌పై
ప్రైవసీ, సెన్సార్‌షిప్ ఆందోళనలు వ్యక్తం
చేస్తున్నప్పటికీ.. టిక్‌టాక్ మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదు.
ఇటీవలే వాల్ట్
డిస్నీకి చెందిన సీజార్ కెవిన్ వేయర్‌ను తన చీఫ్ ఎగ్జిక్యూటివ్
ఆఫీసర్‌గా టిక్ టాక్ నియమించింది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్
కార్ప్, జనరల్ అట్లాంటిక్, సెకోవియాలు బైట్‌డ్యాన్స్ కు సపోర్ట్ ఇస్తున్నాయి. గతేడాదే
షేరు సేల్ చేపట్టాలని ఈ కంపెనీ చర్చలు ప్రారంభించినట్టు ఈ విషయం తెలిసిన వ్యక్తులు
చెప్పారు. కానీ ఈ విషయంపై స్పందించడానికి మాత్రం బైట్‌డ్యాన్స్
నిరాకరించింది.
ప్రపంచంలోనే
అతిపెద్ద పబ్లిక్ కంపెనీలైన ట్విటర్, స్నాప్ వంటి
ప్రత్యర్థులను కూడా ఈ చైనీస్ స్టార్టప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయంలో
వెనక్కి నెట్టింది. అయితే ఇంకా ఫేస్‌బుక్‌ను దాటలేదు. చైనీస్ ఇంటర్నెట్ లీడర్స్ టెన్సెంట్
హోల్డింగ్స్ లిమిటెడ్, అలీబాబాలతో యూజర్ ట్రాఫిక్, మార్కెటింగ్ డాలర్స్ విషయంలో
తలపడుతోంది. ఈ కంపెనీ ఈ–కామర్స్, గేమింగ్ వంటి
కొత్త వ్యాపారాల్లో కూడా తన ఆపరేషన్స్‌ను బలోపేతం చేసుకుంటోంది. టిక్‌టాక్
ఈ ఏడాది 40 వేల కొత్త జాబ్స్ ను కూడా
నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది. అలీబాబా హెడ్‌కౌంట్‌తో తమ
ఉద్యోగుల సంఖ్యను సమం చేసుకోవాలని ఆశిస్తోంది.