రూ.2,206 కోట్ల నష్టం నమోదు చేసిన ఆర్‌ఆర్‌బీలు
By: chandrasekar Mon, 05 Oct 2020 3:29 PM
మోడీ బకాయిలవల్ల ఆర్‌ఆర్‌బీలు
రూ.2,206 కోట్ల
నష్టం నమోదు చేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ
బ్యాంకులన్నీ (ఆర్‌ఆర్‌బీ) కలిసి రూ.2,206 కోట్ల నష్టం నమోదు చేశాయి. నాబార్డ్ గణాంకాల
ప్రకారం ఏడాది మొత్తంలో 26 ఆర్‌ఆర్‌బీలు రూ.2,203 కోట్లు లాభం ఆర్జించినా 19 ఆర్‌ఆర్‌బీలు
రూ.4,409 కోట్ల
ఉమ్మడి నష్టం సాధించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వీటి నష్టం రూ.652 కోట్లు. ఈ ఏడాది మార్చి 31
నాటికి 26
రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 685
జిల్లాల్లో 45 ఆర్‌ఆర్‌బీలు పని చేస్తున్నాయి. 15
వాణిజ్య బ్యాంకుల స్పాన్సర్ షిప్ లలో పని చేస్తున్న ఈ ఆర్‌ఆర్‌బీలు 21,850 బ్రాంచీలు కలిగి ఉన్నాయి. వీటి మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందు ఏడాదితో పోల్చితే 10.8 శాతం
నుంచి 10.4
శాతానికి తగ్గాయి. ఆస్తుల వర్గీకరణకు వస్తే ప్రమాణాత్మకమైనవి 89.6 శాతం
కాగా ప్రమాణాత్మకం కానివి 3.6 శాతం, అనుమానాస్పదమైనవి 6.5 శాతం, నష్టదాయకమైనవి
0.3 శాతం ఉన్నాయి.
దేశంలో మొత్తం 18 ఆర్‌ఆర్‌బీల
స్థూల మొండి బకాయిలు 10 శాతం కన్నా పైనే ఉన్నాయి. ఆర్‌ఆర్‌బీల స్థూల వ్యాపార
వృద్ధి 8.6 శాతం
ఉంది. అంతకు ముందు ఏడాది వృద్ధిరేటు 9.5 శాతం. అవి నిర్వహించిన మొత్తం వ్యాపారం రూ.7.77 లక్షల
కోట్లు. డిపాజిట్లలో 10.2 శాతం, రుణాల్లో 9.5 శాతం వృద్ధి ఏర్పడింది. ప్రాధాన్యతా రంగ రుణాల వాటా 90.6 శాతం
(రూ.2.70 లక్షల
కోట్లు). ఇందులో వ్యవసాయ రుణాలు 70 శాతం ఉండగా ఎంఎ స్‌ఎంఈ రుణాలు 12 శాతం
ఉన్నాయి.
మొత్తం 45 ఆర్‌ఆర్‌బీల్లో
17 ఆర్‌ఆర్‌బీల
మూలధనంలో రిస్క్ ఆధారిత ఆస్తుల నిష్పత్తి (సీఆర్‌ఏఆర్) 9 శాతం
కన్నా తక్కువ ఉంది. 6 ఆర్‌ఆర్‌బీలు నెగిటివ్ సీఆర్‌ఏఆర్ కలిగి ఉన్నాయి.