Advertisement

రూ.12 వేలలోపే రెడ్ మీ నోట్ 9 ఫోన్..!

By: Anji Thu, 27 Aug 2020 12:30 PM

రూ.12 వేలలోపే రెడ్ మీ నోట్ 9 ఫోన్..!

రెడ్ మీ నోట్ 9 సిరీస్ లో తాజాగా షియోమీ లాంచ్ చేసిన రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈరోజున (ఆగస్టు 27వ తేదీ) లాంచ్ చేయనున్నారు. దీని యొక్క ధర, ఫీచర్స్ కోసం పూర్తిగా చదవండి.

షియోమీ గత నెలలో రెడ్ మీ నోట్ 9 సిరీస్ లో కొత్త ఫోన్ అయిన రెడ్ మీ నోట్ 9ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజున (ఆగస్టు 20వ తేదీ) లాంచ్ చేయనున్నార. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, ఎంఐ.కాం వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ను అందించారు. దీంతో పాటు వెనకవైపు నాలుగు కెమెరాలు, 5020 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ కూడా ఇందులో ఉన్నాయి.

రెడ్ మీ నోట్ 9 ధర
ఇందులో మొత్తంగా మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గానూ, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గానూ ఉంది. ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్, పెబుల్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

redmi,redmi note 9,note 9 pro phone,redmi latest mobiles,redmi 9 smart phone,redmi note 9 series mobile

రెడ్ మీ నోట్ 9 ఫీచర్స్ఇందులో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు 13 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా అందుబాటులో ఉంది.

Tags :
|

Advertisement