Advertisement

RBI కొత్త రూల్స్... 2021 జనవరి 1 నుంచి మొదలవుతుంది

By: Anji Mon, 28 Sept 2020 2:02 PM

RBI కొత్త రూల్స్... 2021 జనవరి 1 నుంచి మొదలవుతుంది

ఎంత భద్రంగా ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ నుంచి మోసగాళ్లు మీ డబ్బులు కొట్టేస్తే ఏం చేస్తారనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవడం మంచిది. దీనికోసం ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చెక్ ప్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్న ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకురానుంది.

2021 జనవరి 1 నుంచి ఇది మొదలవుతుంది. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు. ఈ పద్ధతి ప్రకారం.. రూ.50వేలు అంతకంటే ఎక్కువ చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ తప్పనిసరి. దాని గురించి అకౌంట్ హోల్డర్ నే ముందు అడుగుతారు. రూ.5లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లకు చెక్ లు తప్పనిసరి. చెక్ ఇష్యూయర్ మినిమం డిటైల్స్ సమర్పించాల్సి ఉంటుంది.

చెక్ డేట్ - బెనిపిషియసీ పేరు - పేయీ - డబ్బులు తీయాలనుకున్న బ్యాంక్ పేరు - ఎలక్ట్రానికల్ పద్ధతిలో అంటే ఎస్సెమ్మెస్ - మొబైల్ యాప్ - ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎంలలో వివరాలు ఇవ్వాలి.పేమెంట్ చేయడానికి ముందు చెక్ మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి.

కొన్ని పార్టిసిపెంట్ బ్యాంక్స్ లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన సీటీఎస్ పాజిటివ్ పే ను వాడనున్నారు. అందరు అకౌంట్ హోల్డర్లకు రూ.50వేలు అంతకంటే ఎక్కువ చెక్ అథారిటీని అప్రూవ్ చేయాలి. బ్యాంకులు పాజిటివ్ పే సిస్టమ్ గురించి ఎస్ ఎమ్ ఎస్ అలర్ట్స్ - బ్రాంచులలో డిస్ ప్లే చేయాలి.

ఏటీఎంలు - వెబ్ సైట్ - ఇంటర్నెట్ బ్యాంకింగ్ లలో అందుబాటులో ఉంచాలి. పాజిటివ్ పే సిస్టమ్ కు అనుగుణంగా నియమాలు పాటించిన చెక్ లు మాత్రమే క్లియర్ అవుతాయి. ఇటువంటి ఏర్పాట్లు చేయడానికి బ్యాంకులకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు.

Tags :
|
|

Advertisement