నిఫ్టీ11,500 పైకి
By: chandrasekar Thu, 27 Aug 2020 8:52 PM
ఈ రోజు చివరి గంటలో కొనుగోళ్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆరంభ లాభాలను కోల్పోయినా 3 పైసల లాభంతో 74.30 వద్ద ముగియడం.... కలసి వచ్చాయి. సెన్సెక్స్ 39,000 పాయింట్లపైకి, నిఫ్టీ 11,500 పాయింట్లపైకి ఎగబాకాయి. ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో నెలలో ముగియనుండటంతో సూచీలు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 39,074 పాయింట్ల వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 11,550 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా నాలుగో రోజూ మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా ఎనిమిదో రోజూ ఎగిశాయి. 2020 జనవరి తర్వాత ఈ సూచీలు వరుసగా ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి.
యూరప్
మార్కెట్ల జోష్...
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. కానీ ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ. నష్టాల మధ్య దోబూచులాడాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్లో చివరి గంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఒక దశలో 79 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 268 పాయింట్లు ఎగసింది. రోజంతా 347 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
సమీప భవిష్యత్తులో 11,850 పాయింట్స్ కు నిఫ్టీ...,
నిఫ్టీ
11,500 పాయింట్ల కీలక నిరోధాన్ని అధిగమించిన నేపథ్యంలో నేడు(గురువారం) ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగవచ్చని చార్ట్‌వ్యూఇండియాడాట్ ఇన్ ఎనలిస్ట్ మజ్‌హర్ మహ్మద్ అంచనా వేస్తున్నారు. నిఫ్టీ సమీప భవిష్యత్తులో 11,850కు చేరవచ్చన్నారు. కాగా దాదాపు అన్ని కీలక నిరోధాలను నిఫ్టీ అధిగమించిందని కొందరు టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. నిఫ్టీ 11,400 ఎగువన కొనసాగినంత కాలం ఇదే జోరు ఉంటుందని, ఈ స్థాయి కంటే దిగువకు వస్తే, తదుపరి మద్దతు 11.250 పాయింట్లని వారంటున్నారు.