ఐసీఐసీఐ లాంబార్డ్ లో వాటా విక్రయించిన ఐసీఐసీఐ
By: Sankar Fri, 19 June 2020 4:29 PM
దేశీయ ప్రైవేట్ రంగఐసీఐసీఐ బ్యాంక్ తన జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌లో 3.96శాతం వాటాను విక్రయించింది. ఈ వాటా విక్రయం మొత్తం రూ.2250 కోట్లుగా ఉంది. వీలు చిక్కిన ప్రతిసారీ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడాన్ని పరిశీస్తామని త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కోంది. అందులో భాగంగా తన ఇన్సూరెన్స్ సంస్థలో 3.96 వాటాను విక్రయించినట్లు తెలుస్తోంది.
ఇందుకు ముందు బోర్డు సమావేశంలో తీసుకున్న తీర్మానానికి అనుగుణంగా నేడు ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మొత్తంలో వాటాలో 3.96శాతానికి సమానమైన 1.8కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించడమైంది. ఈ వాటా అమ్మకం ద్వారా మొత్తం రూ.2250 కోట్లను సమీకరణ చేస్తున్నాము.’’ అని ఎక్చ్సేంజ్‌లకు ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
ఈ అమ్మకంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ హోల్డరింగ్ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 51.9శాతానికి దిగివస్తుంది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం మార్చి 31నాటికి ఇన్సూరెన్స్ కంపెనీలో బ్యాంక్ 55.86శాతం వాటాను కలిగి ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కోవిడ్-19 ప్రభావంతో ఈ మార్చి క్వార్టర్‌లో ప్రోవిజన్లకు రూ.2,725 కోట్లను కేటాయించింది. ఆర్‌బీఐ ఏప్రిల్ 17 నాడు ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంక్ చేసిన కేటాయింపు అవసరం కంటే ఎక్కువగా ఉన్నాయి.