ఒప్పో రెనో 3 ప్రో ఫోన్ పై భారీ తగ్గింపు
By: chandrasekar Thu, 13 Aug 2020 04:37 AM
ఒప్పో రెనో 3 ప్రో
ఫోన్ పై భారీ తగ్గింపును ప్రకటించింది ఒప్పో సంస్థ. ఒప్పో రెనో 3 ప్రో
స్మార్ట్ ఫోన్ ధర మనదేశంలో మళ్లీ తగ్గింది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ
స్టోరేజ్ వేరియంట్ పై రూ.2,000 తగ్గింపు లభించగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ
స్టోరేజ్ వేరియంట్ పై రూ.3,000 వరకు ధర తగ్గింపు లభించింది. ఇందులో ఆక్టాకోర్
మీడియాటెక్ హీలియో పీ95 ప్రాసెసర్ ను అందించారు. ఈ ఫోన్ మనదేశంలో మార్చిలో
లాంచ్ అయింది.
ఒప్పో రెనో 3 ప్రో
స్పెసిఫికేషన్లు మరియు ధర వివరాలు:
* ఈ స్మార్ట్ ఫోన్ లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+
సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా
ఉండగా, స్క్రీన్
టు బాడీ రేషియో 91.5 శాతంగా ఉంది.
* ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో పీ95
ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
* ఫోన్లో 8 జీబీ ర్యామ్,
256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది.
* ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలను
అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా
వైడ్ యాంగిల్ కెమెరా, 13 మెగా పిక్సెల్ టెలిఫొటో సెన్సార్, 2 మెగా
పిక్సెల్ మోనో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. 5x హైబ్రిడ్ జూమ్,
20x డిజిటల్ జూమ్ వరకు ఈ కెమెరాలు సపోర్ట్ చేస్తాయి.
* సెల్ఫీల కోసం ముందువైపు 44 మెగా
పిక్సెల్, 2 మెగా
పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను అందించారు.
* ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ ఓఎస్ 7పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
* ఇందులో బ్యాటరీ సామర్థ్యం 4,025
ఎంఏహెచ్ కాగా, 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ స్మార్ట్ ఫోన్
సపోర్ట్ చేస్తుంది.
* 4జీ వోల్టే, వైఫై 802.11ac,
బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు
వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
* ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో
అందించారు.
స్మార్ట్ ఫోన్ ఒప్పో రెనో 3 ప్రో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇంతకు ముందు రూ.29,990గా ఉండగా ఇప్పుడు రూ.27,990కు తగ్గింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ వేరియంట్ ధర రూ.32,990 నుంచి రూ.29,990కు తగ్గించింది. గతంలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ 128 జీబీ వేరియంట్ పై రూ.2,000
తగ్గించారు.