Advertisement

భూసారాన్ని పెంచే ‘పచ్చిరొట్ట’

By: chandrasekar Sat, 20 June 2020 10:00 AM

భూసారాన్ని పెంచే ‘పచ్చిరొట్ట’


వర్షాలు కురిస్తే పంటలు సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో నేలలో సారం ఎంత మేరకు ఉందన్న విషయంపై రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భూసారం పెంచుకుంటేనే అధిక దిగుబడులు సాధించొచ్చు. ఇందుకు పచ్చిరొట్ట పైరు ఎంతో దోహదం చేస్తుంది.

పంట సాగుకు ముందు భూమిలో పచ్చి రొట్ట వేసుకుని పెరిగిన తర్వాత భూమిలో కలియ దున్నితే పంటకు కావాల్సిన పోషక పదార్థాలను నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది.

దీంతో మొక్కలకు, వేర్లకు గాలి, నీరు పోషకాలు బాగా అందుతాయి.

మొక్కలకు సూక్ష్మపోషక పదార్థాల లోపాలు రాకుండా చూసుకోవచ్చు.పంట నాణ్యతగా ఉండి దిగుబడి పెరుగుతుంది.

ముఖ్యంగా చౌడు భూముల్లో జీలుగ వేయడంతో చౌడును తగ్గించుకోవచ్చు.

increase,ground,strenth,fields,farmers ,భూసారాన్ని, పెంచే, పచ్చిరొట్ట,సూక్ష్మపోషక, పదార్థాల


పచ్చిరొట్ట పైరులైన పిల్లి పెసర, జీలుగ, జనుము, పెసర అపరాల జాతికి చెందిన పంటలు వాటి వేర్లపై ఉండే బుడిపెల్లో రైజోబియం బ్యాక్టీరియా ఉండి, వాతావరణంలోని నత్రజని తీసుకుని మొక్కలకు అందిస్తాయి. భూమికి కూడా అందించడంతో నేల సారవంతం అవుతుంది.

చౌడు నేలల్లో పచ్చిరొట్ట పైరులను తొలకరి వర్షాలు పడగానే ఎకరానికి పిల్లిపెసర 6 కేజీలు, జీలుగ 12 కేజీలు, జనుము 18 కేజీలు వేసుకోవాలి. పూత దశలో భూమిలో కలియదున్నడంతో చౌడు తీవ్రతను తగ్గించవచ్చు.

జీలుగతో భూసారం పెరుగుతుంది. ఎకరం జీలుగ సాగు చేస్తే 5 టన్నుల ఎరువు తయారవుతుంది. గతంలో కన్నా ఈ సారి రైతులు సాగు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. 30 కిలోల విత్తనం 2.20 ఎకరాలకు సరిపోతుంది. జీలుగ విత్తనాలు ఇప్పటికే కొంత మంది రైతులు వేశారు. ఇంకా ఆసక్తి ఉన్న రైతులు జీలుగ వేసుకోవచ్చు.

Tags :
|
|

Advertisement