గుడ్ న్యూస్: ఇప్పుడు ఇక ఇంటి వద్దకే డబ్బులు..!
By: Anji Sat, 26 Sept 2020 4:34 PM
కరోనా వైరస్ దెబ్బకి చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. చాలా మంది ఏటీఎంకు వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు ఒక బ్యాంక్ ఇంటి వద్దకే నగదు పంపే సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం ఈ బ్యాంక్ మాత్రమే కాకుండా పేటీఎం కూడా ఈ సర్వీసులు ఆవిష్కరించింది. క్యాష్ మేనేజ్‌మెంట్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ సీఎంఎస్‌కు తాజాగా కర్నాటక బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు కోసం కాంట్రాక్ట్ లభించింది.
ఇంటి వద్దకే డబ్బులు తీసుకురావడం కూడా ఇందులో భాగమే. క్యాష్2హోమ్ సర్వీసుల కోసం కర్నాటక బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లు సీఎంఎస్‌తో జతకట్టాయని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తెలిపింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల నిబంధనలకు అనుగుణంగానే ఇప్పుడు క్యాష్2హోమ్ సేవలు ఉన్నాయని సీఎంఎస్ తెలిపింది. కాగా సీనియర్ సిటిజన్స్‌కు ఇప్పటికే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
పలు బ్యాంకులు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సర్వీసులు అందిస్తున్నాయి. ఇకపోతే సీఎంఎస్ సంస్థకు దేశవ్యాప్తంగా 1,15,000 ఏటీఎం నెట్‌వర్క్ ఉంది. అలాగే రిటైల్ ఔట్‌లెట్స్ కూడా ఉన్నాయి. దేశంలో 98.3 శాతం జిలాల్లో సీఎంఎస్ విస్తరించి ఉంది. క్యాష్2హోమ్ సర్వీసుల ద్వారా బిల్లు చెల్లింపు, మనీ విత్‌డ్రా వంటి పలు రకాల సేవలు ఇంటి వద్దనే పొందొచ్చు. హైదరాబాద్, బెంగళూరులోని కర్నాటక బ్యాంక్ కస్టమర్లు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చు. ఇక దేశ రాజధానిలోని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు ఈ సేవలు లభిస్తాయి.