బంఫర్ ఆఫర్: రూ.18,350 లకే మారుతి కార్లు
By: Anji Sat, 29 Aug 2020 1:43 PM
మారుతీ సుజుకీ చందా (సబ్‌స్ర్కిప్షన్) ప్రాతిపదికన కొత్త కారు ఇచ్చే కొత్త సేవలను ప్రారంభించింది. ఇందు కోసం మైల్స్ ఆటోమోబైల్ టెక్నాలజీ్‌సతో ఒప్పందం కుదుర్చుకుంది. కారు కొనకుండానే సొంత కారు వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.
ముందుగా ఈ సేవలను హైదరాబాద్, పుణెల్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. స్విఫ్ట్, విటారా బ్రెజా, ఎర్టిగో, బాలెనో, సియాజ్ కార్లను సబ్‌స్ర్కిప్షన్ కింద తీసుకోవచ్చు. 12, 18, 24, 30 ,36, 42, 48 నెలలకు కారును చందా కింద తీసుకుని వినియోగించుకోవచ్చు. స్విఫ్ట్ ఎల్‌ఎక్స్‌ఐ కారుకు హైదరాబాద్‌లో నెలకు అన్ని పన్నులు కలిపి రూ.18,350 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే పుణెలో రూ.17,600 ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ముందుగా ఎటువంటి చెల్లింపులు (డౌన్ పేమెంట్) చేయాల్సిన అవసరం లేదు. చందా కాలం పూర్తయిన తర్వాత ఖాతాదారు బైబ్యాక్ ఆప్షన్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ విధానంలో డౌన్ పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. కారు నిర్వహణ, బీమా ఖర్చులు వినియోగదారుడిపై ఉండవు. కారు చెడిపోతే సేవలు అందిస్తారు. రీసేల్ రిస్క్ ఉండదు. ఇటువంటి ప్రయోజనాలు వినియోగదారులను ఆకర్షించగలవని కంపెనీ భావిస్తోంది. మైల్స్ కారు నిర్వహణ సేవలను పర్యవేక్షిస్తుంది.