అందాన్నిపెంచే మల్లెల రసం
By: chandrasekar Tue, 23 June 2020 6:33 PM
మల్లెపూలు మంచి సువాసనను
వెదజల్లడంతోపాటు జడ అందాన్ని పెంచుతాయి. అంతేనా అలంకరణకు మల్లెపూలు ఎంతో
తోడ్పడుతాయి. అయితే మనకు తెలియని మరో విషయం ఏమిటంటే మల్లెపూల రసం
ఆరోగ్యాన్ని, అందాన్ని
రెట్టింపు చేస్తుందనడంలో ఆశ్చర్యపోనవసరం లేదు.
* కళ్లు
బాగా అలసటగా ఉన్నప్పుడు మల్లెపూల రసంతో కంటి చుట్టు భాగాల్లో మర్దన చేసుకొని
పడుకుంటే చల్లగా ఉంటుంది.
* అరోమాథెరపీలో
కూడా ఇప్పుడు మల్లెపూలను వాడుతున్నారు.
* మల్లెపూల
రసాన్ని, గులాబీల రసంతో కలిపి ముఖానికి రాసుకంటే చర్మం
మృదువుగా తయారవుతుంది.
* సబ్బులు, తలనూనెలు, సౌందర్య
సాధనాల్లో కూడా నేడు మల్లెపూలను వాడుతున్నారు.
* చర్మానికి
అవసరమయ్యే విటమిన్ సి మల్లెపూలలో పుష్కలంగా దొరుకుతుంది.
* మొటిమల
వల్ల వచ్చే మచ్చలకు మల్లెల నూనె రాస్తే ఫలితం ఉంటుంది.
* చుండ్రుతో
బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టించవచ్చు.
* కొబ్బరినూనెతో
కలిపి మల్లెపూల రసాన్ని తలకు రాసుకుంటే మంచి సువాసన వస్తుంది.
* మల్లెల
సువాసన నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.
* మల్లెపూలతో
తయారు చేసే పలు ఔషధాలు కణితులను కూడా నివారిస్తాయని అనేక పరిశోధనలు
తెలియజేస్తున్నాయి.