Advertisement

  • పురుషులు కూడా ఈ చిట్కాలను పాటించి మీ చర్మాన్ని అందంగా చేసుకోవచ్చు...!

పురుషులు కూడా ఈ చిట్కాలను పాటించి మీ చర్మాన్ని అందంగా చేసుకోవచ్చు...!

By: Anji Thu, 03 Dec 2020 6:21 PM

పురుషులు కూడా ఈ చిట్కాలను పాటించి మీ చర్మాన్ని అందంగా చేసుకోవచ్చు...!

అందం సంరక్షణలో స్త్రీలు చూపించే శ్రద్ద పురుషులు చూపించారు. సాధారణంగా పురుషుల చర్మం మహిళల చర్మం కన్నా చాలా రఫ్ గా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో యువకులు వారి చర్మ సంరక్షణఫై శ్రద్ధ చూపిస్తున్నారు.

దుమ్ము, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మొటిమలు వంటి అనేక అంశాలు చర్మం నీరసంగా మరియు నల్లగా కనిపించేలా చేస్తాయి. ఈ సమస్యలను తగ్గించడానికి చర్మం రంగును మెరుగుపరచడానికి మార్కెట్లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.

కానీ ఈ ఉత్పత్తులు రసాయనాలను కలిగి ఉన్నందున అందరికీ అనుకూలంగా ఉండవు. కాబట్టి ఇంటి చిట్కాలను పాటించి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు.

ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ కాఫీ పొడి, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ తీసుకుని ఈ పదార్ధాలను బాగా కలపి మీ ముఖానికి రాసుకుని 15 నిముషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఈ మిశ్రమం మీ చర్మ కణాలను తొలగించి మీ చర్మం తాజాగా, మృదువుగా చేస్తుంది.

వేపఆకులను పేస్ట్ చేసి అందులో గంధపు పొడి, బాదం పొడి, పసుపు పొడి వేసి బాగా కలిపి ఈ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ ముఖం ప్రకాశవంతంగా, తాజాగా కనిపించడానికి సహాయపడుతుంది.

నిమ్మకాయ ముఖంను శుద్దిచేసే సహజ ఉత్పత్తి. ఇంట్లో ఫేస్ వాష్ బదులు నిమ్మరసం వాడవచ్చు. ఇది బ్లీచ్ లక్షణాలు కలిగి ఉంటుంది, దీన్ని చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా మరియు అందంగా కనిపిస్తుంది.

నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకుని 15 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. తేనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి ముఖం మీద ఉన్న దుమ్ము, ధూళిని తొలగించడానికి సహాయపడుతుంది.

ముఖాన్ని శుభ్రం చేయడానికి మీరు పైనాపిల్ కూడా ఉపయోగించవచ్చు. పైనాపిల్ ముక్కతో ముఖాన్ని రుద్ది తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. తాజా చర్మాన్ని పొందడానికి ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటించడం మంచిది.

బొప్పాయి మన చర్మాన్ని ఆరోగ్యంగా మరియు అందంగా ఉంచడానికి సహాయపడుతుంది. పచ్చి బొప్పాయి పేస్ట్‌ చేసుకుని ఈ పేస్ట్ ను మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

ఆరోగ్యకరమైన చర్మానికి ఆరెంజ్ సమర్థవంతమైన నివారణ. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల ఇది చర్మం రంగును పెంచుతుంది. ఆరెంజ్ రసంలో చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మీద అప్లై చేసి 20 నిమిషాలు ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.

చర్మానికి తేమ చాలా అవసరం. ఇందుకోసం ఐస్ క్యూబ్ తీసుకొని నిద్రవేళకు ముందు 15 నిమిషాలు వాటిని మీ చర్మంపై రుద్దితే చర్మం కాంతివంతంగా మారుతుంది.

Tags :

Advertisement