కుంకుమపువ్వు తో చర్మాన్ని మెరిపించడం ఎలా ..!
By: Sankar Tue, 04 Aug 2020 10:14 PM
పాలల్లో కుంకుమపువ్వు వేసుకొని తాగితే పుట్టబోయే బిడ్డ అందంగా పుడతారని వైద్యులు చెబుతుంటారు. కానీ కుంకుమ పువ్వు పుట్టబోయే బిడ్డకే కాదు, మహిళల చర్మాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఉపయోగపడుతుంది. మరి ఆ కుంకుమపువ్వుతో ఫేస్‌మాస్క్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం
1. ఒక టేబుల్‌స్పూన్ గంధం, మూడు కుంకుమ పువ్వు రేకులు, రెండు టీ స్పూన్ల పాలను తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగానికి రాసుకొని కాసేపు మర్దన చేయాలి. ఆరిన తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది. తరుచూ ఇలా చేస్తుంటే చర్మం మిలమిలా మెరుస్తుంది.
2. పచ్చిపాలు చర్మానికి రాసుకున్నా తలతలా మెరిసిపోతుంది. దీనికి కాస్త కుంకుమ పువ్వు యాడ్ చేస్తే.. చిటికెడు కుంకుమ పువ్వులో నాలుగు టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని దూదితో ముఖానికి రాసుకోవాలి. కాసేపు ఇలా మర్దన చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే కోల్పోయిన సహజ కాంతిని తిరిగి పొందుతారు.
3. అదేవిధంగా కుంకుమ పువ్వు రేకులు, కొబ్బరి నూనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకున్నా ఫలితం ఉంటుంది
4. రెండు, మూడు తంతువుల కుంకుమ పువ్వు, కొంచెం తేనె వేసుకొని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి మాత్రమే కాకుండా మెడకు కూడా రాసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మచ్చలేని చర్మం మీ సొంతమవుతుంది.
5. అలాగే మహిళలకు రుతుక్రమం సమయంలో వచ్చే తిమ్మిర్లను కూడా కుంకుమ పువ్వు పోగొడుతుంది. పాలలో కాస్త కుంకుమపువ్వు కలుపుకుని తాగితే రుతుక్రమం సమయంలో ఎక్కువగా రక్తస్రావం కావడం వంటి సమస్య కూడా ఉండదు.