Advertisement

దక్షిణ భారత దేశంలో పర్యాటక ప్రదేశాలు

By: chandrasekar Tue, 18 Aug 2020 8:51 PM

దక్షిణ భారత దేశంలో పర్యాటక ప్రదేశాలు


దక్షిణ భారత దేశంలో పర్యాటక ప్రాముఖ్యత ఉన్న ఎన్నో ప్రదేశాలు ప్రకృతి అందాలతో కూడిన హిల్ స్టేషన్లు, నదులు, జలపాతాలు, గుహలు, బీచ్ లు, వారసత్వ నిర్మాణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే దక్షిణ భారతదేశంలో లేని పర్యాటక ప్రదేశం అంటూ ఏదీ లేదు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు ఎన్నో పర్యాటక ఆకర్షణలు టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

* బెంగళూరు సమీపంలో వున్న 'స్కందగిరి'

స్కందగిరిని కలవర దుర్గ అని కూడా పిలుస్తారు. బెంగళూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం గురించి పెద్దగా చెప్పనప్పటికీ, వీటి అందమైన ఛాయా చిత్రాలు బెంగళూరులో నివసించే ప్రజలకు దీనిని ఓ ప్రత్యేకమైన వారాంతపు గమ్యస్థానంగా చెప్పవచ్చు.

బళ్లారి రోడ్ నేషనల్ హైవే 7 హైదరాబాద్ - బెంగళూరు హైవే లో నంది హిల్స్, మద్దనహళ్లి వైపు చూస్తే ఈ ఉత్కంఠభరితమైన ప్రదేశాన్ని కనుగొనవచ్చు. 1350 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలో డిసెంబర్ లో సందర్శించాల్సిన ఉత్తమైన ప్రదేశాల్లో ముఖ్యమైనది.

* రామేశ్వరం సమీపంలో వున్న 'ధనుష్కోడి'

రామేశ్వరం సమీపంలో వున్న ధనుష్కోడిని 'దెయ్యాల నగరం' లేదా 'కోల్పోయిన నగరం' అని పిలవబడి ఎప్పటికీ చెరగని గుర్తింపును కలిగి ఉంది. 'విల్లు చివర' అని అనువదించబడే ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రంలోని పంబన్ ద్వీపంలో ఉంది. శ్రీలంకలోని తలైమన్నార్ కు ఈ ప్రదేశం కేవలం 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. వివిధ కధనాల ప్రకారం 1964లో ఏర్పడిన భీకర తుఫానులో పంబన్ నుంచి ధనుష్కోడికి ఉన్న రైల్వే లైన్ నాశనమైంది.

ఈ తుఫాను సమయంలో దురదృష్టవశాత్తు ధనుష్కోడి వెళ్తున్న పాసింజర్ లో తుఫాను తాకిడి గురై 100 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. భారతదేశం, శ్రీలంక మధ్య సరిహద్దుగా ఉండే ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత చిన్నది. దీని వైశాల్యం 45 మీటర్లు. 1964 విపత్తు తర్వాత ధనుస్కోడి టూరిస్ట్ ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రామేశ్వరం వెళ్లిన వారందరు దీనిని సందర్శిస్తారు.

* ధర్మపురికి సమీపంలో వున్న 'హొగెనక్కల్' జలపాతాలు

ఉత్కంఠభరిత అనుభూతిని అందించే హొగెనక్కల్ జలపాతాలు తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో కావేరీ నదిపై ఉన్నాయి. ధర్మపురి పట్టణం నుంచి 46 కిలోమీటర్ల మరియు బెంగళూరు నుంచి 180 కిలోమీటర్లు దూరంలో ఈ జలపాతాలు ఉన్నాయి. ఈ నీటికి ఔషధ విలువలు ఉన్నట్లు చెబుతారు.

ఇక్కడ స్నానాలు చేయడంతో పాటు బోటింగ్ చేసేందుకు పర్యటకులు ఉత్సాహం చూపిస్తారు. బోటింగ్ సమయంలో నది ఒడ్డున గ్రామ మహిళలు అందించే తాజా చేపల కూరలు ఎంతో రుచికరంగా ఉంటాయని టూరిస్టులు చెబుతుంటారు.

ఈ ప్రదేశం గురించి పర్యాటకులకు పెద్దగా సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల పర్యాటకుల తాకిడి ఇక్కడ కొంచం తక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు అధికంగా ప్రవహిస్తుంది. అందువల్ల బోటింగ్ వసతిని ఆ సమయంలో రద్దు చేస్తారు.

Tags :
|
|

Advertisement