Advertisement

ఖైదీలతో నడిచే కాఫీ షాప్ ..ఎక్కడో తెలుసా ..?

By: Sankar Sat, 13 June 2020 8:23 PM

ఖైదీలతో నడిచే కాఫీ షాప్ ..ఎక్కడో తెలుసా ..?

పర్వత ప్రాంతంలో... చల్లని వాతావరణంలో వేడి వేడి కప్పు కాఫీను ఆస్వాదిస్తూ ఆసక్తికరమైన పుస్తకాన్ని చదవడం ఒక ప్రత్యేకమైన అనుభవం అని చెప్పవచ్చు. అలాంటి ఓ ప్రదేశం గురించే మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు. ఇక్కడ పని చేసే వారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ కేఫ్ లో పని చేసేది సాధారణ వ్యక్తులు కాదు... జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలు. అవును మీరు చదివింది నిజమే. ఖైదీలే ఇక్కడ కస్టమర్లకు సర్వీస్ చేస్తారు. పైన చెప్పిన అనుభవాన్ని మీరు కోరుకుంటే షిమ్లా వెళ్లినప్పుడు ఖచ్చితంగా ఈ కేఫ్ ను సందర్శించండి. దీనిని షిమ్లాలోని ఒక కొండపై ఏర్పాటు చేశారు.

బుక్ కేఫ్ అనే పేరుతో ఏర్పాటైన ఈ కేఫ్ షిమ్లాలోని ప్రత్యేకమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ కాఫీతో పాటు ఎన్నో రకాల స్నాక్స్, రుచికరమైన పానీయాలు, చుట్టూ అద్భుతమైన పర్వతాల దృశ్యాలను కూడా పొందవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ కేఫ్ లో రోజు వారీ కార్యకలాపాలను షిమ్లా సమీపంలోని కైతు జైల్ లో ఉన్న నలుగురు జీవిత కాల ఖైదీలు నడిపించడం విశేషం. కేఫ్ పేరుకు తగిన విధంగానే ఇందులో ఒక మినీ లైబ్రరీ ఉంటుంది. అక్కడ మీరు నచ్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకుని హాయిగా కేఫ్ లో సేదతీరుతూ... స్నాక్స్ తింటూ చదువుకోవచ్చు.


ఖైదీల పునరావాసం కోసం ఒక గొప్ప చొరవగా పని చేస్తున్న ఈ కేఫ్ కు హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హెచ్‌పి‌టి‌డి‌సి) నిధులు సమకూర్చింది. ఈ కేఫ్ లో మొత్తం 40 మంది కూర్చునేందుకు అవకాశం ఉంది. బుక్ కేఫ్ ను ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 9 గంటలకు మూసివేస్తారు.


Tags :
|
|
|
|

Advertisement