Advertisement

  • మధుమేహ వ్యాధి గ్రస్తులు వాకింగ్ చేయడంవల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతుందట

మధుమేహ వ్యాధి గ్రస్తులు వాకింగ్ చేయడంవల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతుందట

By: chandrasekar Mon, 24 Aug 2020 10:14 PM

మధుమేహ వ్యాధి గ్రస్తులు వాకింగ్ చేయడంవల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతుందట


మధుమేహ వ్యాధి గ్రస్తులు వాకింగ్ చేయడంవల్ల రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. నేడు ప్రపంచంలో అత్యధిక పేషెంట్లను ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వల్ల షుగర్ వ్యాధి డయాబెటిస్ మనల్ని బానిసను చేసుకుంటోంది. అయితే తరుచుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్‌ను మన దరి చేయనీకుండా చేయగలమని న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రతిరోజూ భోజనం చేసిన అనంతరం ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్ లెవల్స్ భారీగా తగ్గుతాయని గుర్తించారు. ఎక్కువగా మనం రాత్రివేళ ఆలస్యంగా తిని అలాగే నిద్రిస్తున్నాం. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. కనుక రోజూ రాత్రిపూట తిన్న తర్వాత ఓ పది నిమిషాలు సరదాగా అలా నడిస్తే బ్లడ్ షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లను వారికి వీలున్న సమయంలో 30 నిమిషాలపాటు నడవాలని సూచించారు. వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ కొలిచారు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్ పేషెంట్ల రక్తంలోని షుగర్ లెవల్స్‌ను పరీక్షించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు.

మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసిన వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 12శాతం అధికంగా తగ్గడం గుర్తించారు. ఇక రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్ చేసిన వారిలో ఏకంగా 22శాతం వరకు షుగర్ లెవెల్స్ తగ్గినట్లు రీసెర్చర్స్ వివరించారు. ఇలా వాకింగ్ చేస్తే మధుమేహం సమస్య దరిచేరదని చెబుతున్నారు. శరీరానికి మానసిక, శారీరక ఉల్లాసం దొరుకుతుందట. వారి పనితీరు సైతం మెరుగైనట్లు రిపోర్టులో తెలిపారు. సాధారణంగా వాకింగ్ చేయడంవల్ల ఆరోగ్యానికి చాల మేలు కలుగుతింది. ఇటు మానసికంగాను అటు శారీరకంగానూ మనిషిని ఉత్తేజంగా ఉంచడానికి వ్యాయాయం ఎంతో మేలు చేస్తుంది. నడవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా ప్రవహించడం వల్ల శరీరం దృడత్వంతో బాటు మంచి వుతేజాన్ని పొందుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Tags :
|

Advertisement