Advertisement

టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిదేనా ..?

By: Sankar Sun, 28 June 2020 5:18 PM

టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం మంచిదేనా ..?



టీ లేదా కాఫీ మనిషి యొక్క జీవితంలో ఒక బాగమైనవి పొద్దున్న లేసింది మొదలు రాత్రి పడుకునేవరకు ఎదో ఒక సందర్భంలో టీ గాని , కాఫీ గాని తాగకుండా చాలా మంది ఉండలేరు ..తలనొప్పిగా ఉన్నా, మగతగా ఉన్నా చాలామంది టీ తాగి కాస్త రిలాక్స్ అవుతారు. కొందరికి టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే, ఈ అలవాటు వల్ల పెద్దగా నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు. వేడి వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే పండ్లను కదిలిస్తాయని, ఫలితంగా త్వరగా దంతాలు ఊడిపోతాయని అంటారు. దీనిపై మీకు ఎలాంటి చింత అవసరం లేదు అని అంటున్నారు నిపుణులు ..అయితే టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే నష్టమా లాభమా తెల్సుకుందాం .అలాగే టీ లేదా కాఫీ ముందు నీళ్లు తాగడం వాళ్ళ కలిగే ఉపయోగాలు కూడా తెల్సుకుందాం

టీ కాఫీల్లో కెఫిన్‌ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, ఉబకాయాన్ని నివారిస్తాయి. కానీ, వీటిలో కెఫిన్‌తోపాటు ఫ్లోరైడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే పళ్లను గార పట్టించే టానిన్ పదార్థాలు ఉంటాయి. కాబట్టి, టీ తర్వాత నోటిని నీళ్లతో పుకిలించడం మంచిది.

ఆహారం లేదా టీ, కాఫీ, పాలు, నీళ్లను వేడి వేడిగా తీసుకోకూడదు. అలా చేస్తే నోటి నుంచి అన్నవాహిక వరకు ఉండే ఏరో డైజస్టివ్ సిస్టమ్‌పై ఉండే పొర దెబ్బతింటుంది. అవి తాగే ముందు కొన్ని నీళ్లు తాగితే ఆ ప్రమాదం తప్పుతుంది.

టీ, కాఫీ, పాలు తాగే ముందు నీళ్లు తాగడం మంచిది. దీని వల్ల నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ దెబ్బతినకుండా ఉంటాయి. ముందుగా నీళ్లు తాగడం వల్ల అవి కాస్త ఉష్ణోగ్రతను భరించగలుగుతాయి.

టీ, కాఫీలు ఎసిడీటీ కలిగిస్తాయి. వాటి వల్ల దంతాలు పాడయ్యే ప్రమాదం ఉంది. ఎసిడిటీ వల్ల కడుపు, గొంతులో కూడా సమస్యలు ఏర్పడతాయి. నీళ్లు తాగిన తర్వాత టీ, కాఫీలు తీసుకుంటే ఏ సమస్య ఉండదు.

టీలో కెఫిన్‌, ధియామిన్‌ లాంటి రసాయనాలు ఉంటాయి. అందుకే వాటిని అతిగా తాగడం మంచిది కాదు. టీ తాగేముందు ముందు లేదా తర్వాత నీళ్లు తాగితే విషతుల్యాలను మూత్రం రూపంలో బయటకు పంపండం వీలవుతుంది. అయితే, టీ తాగిన 5 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిది.


Tags :
|
|
|
|

Advertisement