Advertisement

  • ఇమ్మిగ్రేషన్ వీసా తాత్కాలిక నిలుపుదలపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్

ఇమ్మిగ్రేషన్ వీసా తాత్కాలిక నిలుపుదలపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్

By: Sankar Tue, 23 June 2020 2:59 PM

ఇమ్మిగ్రేషన్ వీసా తాత్కాలిక నిలుపుదలపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్



అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దుందుడుకు పనులతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు ..తాజాగా ఇమ్మగిరేషన్ వీసాల మీద తాత్కాలిక నిషేధం విధిస్తు తీసుకున్న నిర్ణయం మీద సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి..దిగ్గజ టెక్ కంపెనీలు సహా టెక్ నిపుణులు, రాజకీయవేత్తలు ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అమెరికా ఆర్థిక ప్రగతికి ఇమిగ్రేషన్ ఇచ్చిన ప్రోద్బలం అమోఘం. అమెరికాతో పాటు గూగుల్ టెక్ లీడర్ గా ఎదగడానికి అదే కారణం. ఈ సమయంలో ఇమిగ్రెంట్స్ కు మా మద్దతు తెలియజేస్తున్నాం. అందరికీ పని చేసుకునే అవకాశం కల్పించేందుకు కృషి చేస్తాం’ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు..

అమెరికా తాత్కలికంగా నిషేధించిన వాటిలో పాపులర్ వీసాలైన హెచ్1బీ, హెచ్2బీ, హెచ్4, జే, ఎల్ కూడా ఉన్నాయి. ట్రంప్ సంతకం చేసిన కొత్త రూల్స్ రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. వాషింగ్టన్ కు చెందిన ఓ థింక్ ట్యాంక్ లెక్కల ప్రకారం 2.19 లక్షల మంది తత్కాలిక వర్కర్లు కొత్త పాలసీ వల్ల ఉద్యోగాలు కోల్పోతారు. అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, టెస్లా, ఉబర్, పేపాల్ తదితర కంపెనీలు కూడా హై స్కిల్డ్ వర్కర్లను దేశం నుంచి పంపేయడాన్ని వ్యతిరేకించాయి. దీని వల్ల దేశం నష్టపోతుందని తప్ప ఒరిగే లాభమేమీ ఉండదని అభిప్రాయపడ్డాయి.

వర్క్ వీసాల జారీపై తాత్కలిక నిషేధాన్ని ఎత్తేయాలని భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, ప్రెసిడెంట్ ట్రంప్ ను కోరారు. కరోనా తర్వాతి ఫేజ్ ను ఎదుర్కొనేందుకు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న హై స్కిల్డ్ వర్కర్లు అవసరం ఉందని పేర్కొన్నారు. హెచ్1బీ ప్రొగ్రాం ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగులు దేశ హెల్త్ కేర్ సిస్టంను కాపాడుకుంటూ వస్తున్నారని తెలిపారు. హెచ్1బీతో పాటు ఎల్1బీ వీసాల జారీని నిలిపేసే బదులు వాటికి కొన్ని మార్పులు చేయాలని సూచించారు.

అయితే ట్రంప్ కొత్త విధానం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ట్విట్టర్ పబ్లిక్ పాలసీ హెడ్ జెస్సికా తెలిపారు. ఇమిగ్రేషన్ అమెరికాకు ఉన్న అతి పెద్ద సంపద. దాన్ని ట్రంప్ తక్కువగా అంచనా వేశారు అని అన్నారు. శాశ్వత వీసాలపై మరో 60 రోజుల పాటు, తాత్కలిక వీసాలపై ఈ ఏడాది చివరి వరకూ నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం వైట్ హోజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వల్ల దెబ్బతిన్న అమెరికన్లకు ఉపశమనం కలిగించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది.


Tags :
|
|
|

Advertisement