Advertisement

మధురమైన తేనె ఉపయోగాలు ..

By: Sankar Mon, 06 July 2020 12:53 PM

మధురమైన తేనె ఉపయోగాలు ..



తేనె ..అత్యంత మధురమైన పదార్ధం మాత్రమే గాక అత్యంత పోషక విలువలు కలిగి ఉన్నదీ ..ఈ తేనెను ఆయుర్వేదంలోనూ విరివిరిగా వాడారు. ఈ తేనెలో విటమిన్ సి , విటమిన్ బీ6, ఫ్రక్టోస్, కార్బోహైడ్రేట్లు, రైబోఫ్లోవిన్, నియాసిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.అయితే ఇన్ని పోషకాలు ఉన్న తేనెను మనం ఎక్కువగా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు తెల్సుకుందాం ..

కాలిన గాయాలు, ఇతర గాయాల నుంచి తేనె ఉపశమనం కలిగిస్తుంది. గాయమైన చోట తేనే రాస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.

బరువు తగ్గించడంలో తేనె కీలకపాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ కాస్త తేనెను నీళ్లలో కలిపి తీసుకుంటే కొవ్వును కరిగిస్తుంది. తేనె కొవ్వు స్థాయిని నియంత్రిస్తే బరువు పెరగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

గోరు వెచ్చని నీటిలో మిరియాలపొడి, తేనె, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా లాంటి విపత్కర సమయంలో ఇది శ్రేయస్కరం.

తేనె మంచి యంటీబయాటిక్‌గా పని చేస్తుంది. దగ్గు సమస్యకు తేనె చెక్ పెడుతుంది. దగ్గుతో పాటు గొంతు సమస్యను నియంత్రిస్తుంది.

కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రతిరోజూ కొంత మోతాదులో తేనె తీసుకుంటే విటమిన్ సి లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది.

చర్మ సంరక్షణకు తేనె తోడ్పడుతుంది. తేనె - నిమ్మకాయ, తేనె - పాలు, తేనె - అరటిపండు ఇలా ఏదైనా కాంబినేషన్‌తో ఫేస్ ప్యాక్ చేసుకుని చర్మానికి రాసుకోవాలి. కొంత సమయానికి ముఖం కడుక్కుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

జీర్ణ సంబంధ సమస్యలకు సైతం తేనె పరిష్కారం చూపిస్తుంది. ప్రతిరోజూ తేనె కాస్త తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.

Tags :
|
|

Advertisement