Advertisement

చామదుంపలతో వెయిట్ లాస్...

By: chandrasekar Thu, 08 Oct 2020 4:43 PM

చామదుంపలతో వెయిట్ లాస్...


ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. చామ దుంపలను ఎలాగైనా మనం తరచూ తీసుకోవచ్చు. వాటితో మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి.

చామదుంపలు వల్ల లాభాలు...

* అధిక బరువు తగ్గాలనుకునే వారు చామదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక వీటిని తినడం వల్ల గుండెకు కావల్సిన పోషకాలు అందుతాయి. చామదుంపల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.

* గర్భిణీలు చామదుంపలను తినడం వల్ల వికారం, వాంతి వచ్చినట్లు ఉండడం తదితర లక్షణాలు తగ్గుతాయి.

* చామదుంపల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గిస్తుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

* చామదుంపల ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే ఇతర దుంపల్లా వీటిని తినగానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. చాలా నెమ్మదిగా గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ దుంపలను తిసుకోవచ్చు.

* ఈ దుంపల్లో ఉండే విటమిన్ బి6 హైబీపీని తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. మహిళల్లో మెనోపాజ్‌లో వచ్చే సమస్యలు తగ్గాలంటే చామ దుంపలను తినాలి.

Tags :
|
|
|
|

Advertisement