Advertisement

  • వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By: Sankar Thu, 16 July 2020 2:07 PM

వాకింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు



ఇప్పుడు ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో చాల మంది వ్యాయామానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు ..అయితే చాలా మంది ఎక్కువగా నడవడానికి ప్రాధాన్యత ఇస్తారు ..మార్నింగ్ లేవగానే గాని లేదా సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చినాక గాని చాల మంది నడుస్తుంటారు ..అయితే నడక వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ...కానీ నడవడం అంటే ఎలా పడితే ఆలా కాకుండా దానికి కొన్ని నియమానాలు ఉంటాయి ..ఆ నియమానాలు పాటిస్తే మనం నడిచే దానికి ఉపయోగం ఉంటుంది ..అయితే ఏ జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూదాం ..

1. వాకింగ్ చేయడం అప్పుడే ప్రారంభించిన వారు.. మొదటి రోజే ఎక్కువ దూరం, ఎక్కువ సమయం నడవకూడదు. మామూలుగా 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకూ నడవవచ్చు. ఆ తర్వాత నుంచి సమయం, వేగం పెంచాలి. ఎందుకంటే మొదటి రోజే ఎక్కువ దూరం నడవడం వల్ల త్వరగా అలసిపోతాం.. ఆ తర్వాత రోజుకి నడవడానికి అంతగా ఆసక్తి చూపం. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

2. ఎప్పుడూ పడితే అప్పుడు నడిస్తే అనుకున్న ఫలితాలు రావు.. ఉదయం, సాయంత్రం వేళల్లోనే నడవడం వల్ల లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఉదయం నడిస్తే గనుక ఆ ఎనర్జీ మీకు రోజంతా ఉంటుంది. సూర్యుడు నుంచి వచ్చే డి విటమిన్ కూడా దొరుకుతుంది. ఉదయం వేళలో నడవడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ..అదే విధంగా, సాయంత్రం వేళలోనూ చల్లని గాలిని ఆస్వాదిస్తూ నడవడం బావుంటుంది. ఉదయం నుంచి అలసిన శరీరానికి చల్లని గాలి తగులుతూ ఉంటే కాస్తా రిలాక్సేషన్ తోడవుతుంది. దీని వల్ల మార్నింగ్ నుంచి ఎదురైన చికాకులు పటాపంచలు అవుతాయి. ఈ కారణంగా రాత్రుళ్లు హాయిగా నిద్రపడుతుంది..మీకు ఈ రెండు సమయాలలో ఎప్పుడు వీలు ఉంటె అప్పుడు నడవడం మంచిది ..


walking,tips,morning,evening,excersize,health ,వాకింగ్,  చేసేటప్పుడు,  తీసుకోవాల్సిన,  జాగ్రత్తలు , లాభాలు



3. ఇక నడిచే ప్రదేశం కూడా ముఖ్యమే. కొంతమంది రహదారులు, ఫుట్‌పాత్‌లపై నడుస్తుంటారు. అలా కాకుండా పచ్చని చెట్లు, ప్రకృతి పరిసరాల్లోని మైదానాలలో నడవడం మంచిది. నిజానికీ మట్టిలో, పచ్చిక బైళ్ల నడుమ నడవడం మంచిది. ఇది మన పాదాల ద్వారా ఉత్తేజాన్ని మనలో నింపుతుంది..అయితే సిటీలలో మట్టి అంటే కష్టం కాబట్టి పార్క్ లలో నడవడానికి ప్రాధాన్యం ఇవ్వండి ..

4. నడిచేటప్పుడు శరీర విధానంపై కూడా జాగ్రత్త వహించాలి. నడిచేటప్పుడు చేతులు ఊపుతూ శరీరాన్ని నిటారుగా ఉంచాలి. వాకింగ్ మొదలు పెట్టేటప్పుడు, తగ్గించేటప్పుడు వేగంగా ఉండకూడదు. మెల్లిగా మొదలుపెట్టి.. వేగం పెంచి.. ఆపేటప్పుడు వేగాన్ని తగ్గించాలి. అదేవిధంగా.. వేసుకునే బట్టలు కూడా బిగుతుగా ఉండకుండా వదులుగా ఉండేవాటినే ధరించాలి.

5. ఇక ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అదేవిధంగా, ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాలు నడిస్తే మంచిది. మరికొంతమంది పక్కవారితో మాట్లాడుతూ, కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటారు. ఎందుకంటే నడిచేటప్పుడు శ్వాస నియంత్రణ అవసరం.


Tags :
|

Advertisement