Advertisement

కాటన్ బాల్స్‌ ఉపయోగాలు

By: chandrasekar Sat, 18 July 2020 3:29 PM

కాటన్ బాల్స్‌ ఉపయోగాలు


ప్రతిరోజూ వాడే వస్తువులతో మీరు ఎన్నో ఇంటరెస్టింగ్ పనులను చేయవచ్చు. ఈ లైఫ్ హ్యక్స్ అనేవి మీకు ఎంతో సమయాన్ని అదే సమయంలో రిసోర్సెస్ ను కూడా ఆదాచేస్తాయి. ఈరోజు కాటన్ బాల్ ను వివిధ రకాలుగా ఉపయోగించే పద్దతుల తెలుసుకుందాం.

ఒకవేళ మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. పెర్ఫ్యూమ్ బాటిల్ ను తీసుకుని వెళ్లకుండా ఆల్టర్నేటివ్ కోసం మీరు ఆలోచిస్తున్నారు. అప్పుడేం చేయాలంటే, కొన్ని చుక్కల పెర్ఫ్యూమ్ ను కాటన్ బాల్స్ పై వేయండి. వాటిని జిప్ పౌచ్ లో పెట్టండి. ఎప్పుడైతే మీకు టచప్ అవసరమని అనిపిస్తుందో అప్పుడు కాటన్ బాల్ ను తీసుకుని మెడదగ్గర అలాగే అండర్ అర్మ్స్ లో ఉపయోగించండి.

మీ పెర్ఫ్యూమ్ లాగానే మీ మేకప్ ను కూడా ప్యాక్ చేసుకోవడానికి కాటన్ బాల్స్ హెల్ప్ చేస్తాయి. మీ ఫేవరేట్ బ్రాంజర్, బ్లష్ తదితరాలను కాటన్ బాల్ తో రుద్దండి. ఈ కాటన్ బాల్స్ ను జిప్ బ్యాగ్ లో పెట్టండి. మీరెక్కడికి వీలయితే అక్కడికి వీటిని తీసుకెళ్లి టచప్ చేసుకోవచ్చు.

కొన్ని కాటన్ బాల్స్ ను మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ లో ముంచి వీటిని ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నెని కార్నర్స్ లో ఉంచండి. మీరు కావాలంటే కొన్ని చుక్కల వెనిలా ఎక్స్ట్రాక్ట్ ను కూడా కాటన్ బాల్ పై పోసి దాన్ని మీ బట్టలున్న కప్ బోర్డులో ఉంచండి. మీ బట్టలు పరిమళాలను వెదచల్లుతాయంటే నమ్మండి.

కాళ్ళు బొబ్బలెక్కకుండా ప్రొటెక్ట్ చేసేందుకు కూడా కాటన్ బాల్స్ హెల్ప్ చేస్తాయి. ఫుట్ వేర్ ధరించినప్పుడు ఏ ప్రదేశంలో ఐతే ఒత్తిడి పడి బొబ్బలెక్కే అవకాశముందో గమనించి అక్కడ కాటన్ బాల్స్ ను అమర్చండి. దీని వలన కాళ్ళు బొబ్బలెక్కే సమస్య ఎదురయ్యే అవకాశం తక్కువ.

అలాగే, మీ రబ్బర్ గ్లోవ్స్ లైఫ్ స్పాన్ ను కాటన్ బాల్ తో పొడిగించవచ్చు. ఫింగర్ టిప్స్ వద్ద కొన్ని కాటన్ బాల్స్ ను అమర్చి పని కానిస్తే సరి. ఈ విధంగా రబ్బర్ గ్లోవ్స్ చిరిగిపోయే ప్రమాదం తగ్గుతుంది.

బట్టల పై ఇంకు మరకలు పడితే కాటన్ బాల్ ను ఆల్కహాల్ సొల్యూషన్ లో ముంచి దాన్ని ఇంకు మరకలు పడిన ప్రదేశంపై సున్నితంగా రుద్దండి. మరక మాయమవుతుంది.

కీబోర్డ్లు అలాగే టీవీ రిమోట్స్ ను శుభ్రపరచడానికి ఆల్కహాల్ సొల్యూషన్ లో ముంచిన కాటన్ బాల్ తో కీబోర్డ్ కీస్ ను అలాగే రిమోట్ బటన్లను ఈజీగా క్లీన్ చేయవచ్చు.

uses of cotton balls ,కాటన్ బాల్స్‌ ఉపయోగాలు


మీరు మీ నగలను ఎక్కడికైనా తీసుకెళ్లాలని భావిస్తే వాటికి కాటన్ బాల్స్ తో రక్షణను ఇవ్వవచ్చు. కుషన్ లా కాటన్ బాల్స్ తో ప్లాట్ ఫార్మ్ ను ఏర్పాటు చేస్తే నగలు విరిగిపోవు. వాటి నాణ్యత దెబ్బతినదు.

స్కిన్ పై పెర్మనెంట్ మార్కర్ గుర్తులను తొలగించడానికి పాలలో ముంచిన కాటన్ బాల్ తో పెర్మనెంట్ మార్కర్ మరకలపై జెంటిల్ గా రుద్దండి. మరకలు మాయం.

ఎలుకలు, చీమలు అలాగే స్పైడర్స్ తో కష్టపడకుండా ఉండాలంటే కాటన్ బాల్స్ ను పెప్పెర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్లో ముంచి ఇంట్లోని ప్రాబ్లెమాటిక్ ప్లేసెస్ లో ఉంచండి. ఎలుకలు, చీమలు అలాగే స్పైడర్స్ సమస్య తగ్గిపోతుంది. వీటికి పెప్పెర్మెంట్ స్మెల్ అంటే పడదు. కిచెన్ క్యాబినెట్స్ లో ఈ కాటన్ బాల్స్ ను పెడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

బాత్రూంలోని పాచి ఏర్పడే ప్రదేశాలలో కాటన్ బాల్స్ తో అద్భుతం సృష్టించవచ్చు. బాత్రూంలోని ఫ్యాన్ ను ఆన్ చేయండి. కిటికీ తెరిచి ఉంచండి. గ్లోవ్స్ ధరించండి. అన్నిటికన్నా ముందు సేఫ్టీ ముఖ్యం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసి కాస్తంత బ్లీచింగ్ పౌడర్ ను కలపండి. ప్రాబ్లెమాటిక్ ప్రదేశాల్లో ఈ కాటన్ బాల్స్ ను ఉంచండి. కాటన్ బాల్స్ ఆయా ప్రదేశాలకు అతుక్కుపోతాయి. వాటిని అలా రెండు గంటల పాటు ఉండనివ్వండి. ఆ తరువాత వాటిని తొలగించి శుభ్రం చేస్తే బాత్రూం మెరిసిపోతుంది.

ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ను తీసుకోండి. కొన్ని కాటన్ బాల్స్ ను తీసుకోండి. వీటిపై ఈ ఆయిల్ ను పోయండి. బాత్రూం లో ఆ గిన్నెను పెట్టండి. స్పా వంటి పరిమళాలు వస్తాయి.

కాటన్ బాల్ తీసుకుని దాన్లో వెనిలా ఎక్స్ట్రాక్ట్ ను పోయండి. ఈ కాటన్ బాల్స్ ను ఫ్రిడ్జ్ లో చిన్న గిన్నెలో ఉంచండి. ఫ్రిడ్జ్ లోని ఫుడ్ స్మెల్స్ ను న్యూట్రలైజ్ చేయడానికి ఈ ప్రాసెస్ హెల్పవుతుంది. కాటన్ బాల్స్ పై మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ పోయండి. ట్రాష్ క్యాన్ అడుగున ఈ కాటన్ బాల్ ను ఉంచండి. ఇందుకోసం లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లేదా టీ ట్రీ ఆయిల్ ను వాడటం ఉత్తమం. ఎందుకంటే, ఇవి బిన్ ను డిసిన్ఫెక్ట్ చేస్తాయి.


Tags :

Advertisement