Advertisement

  • ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉన్న పనసపండు తినడం వల్ల ఉపయోగాలు

ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉన్న పనసపండు తినడం వల్ల ఉపయోగాలు

By: chandrasekar Tue, 23 June 2020 10:07 AM

ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉన్న పనసపండు తినడం వల్ల ఉపయోగాలు


పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి.. సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు అనాసకు ప్రతికగా పనసపండు సృష్టించాడంటారు. పనసపండులో శరీరారోగ్యాన్ని పెంపొందింపచేసే పలు పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి.

పనసలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండులో ‘ఏ',‘సి' విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉండా ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. అవి దేహానికి పుష్టినిస్తాయి. నాడిశక్తిని పెంచుతాయి.

పనసపండు అంత త్వరగా జీర్ణంకాదు. కాబట్టి అమితంగా ఈ పండును తినరాదు. తక్కువగా తింటేనే మేలు కలుగుతుంది. లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి, ఈ పండు జీర్ణం కావటం కాస్త కష్టం. పనస గింజల్లో తేమ చాల తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలు ఇంకా కఠినంగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లల్లో జీర్ణశక్తి ఎక్కువ కాబట్టి ఈ పండును కాల్చి తింటే, వారికంత అపకారం జరగదు.

uses,consumption,of minerals,and fiber,rich fruit ,ఖనిజాలు, ఫైబర్, ఎక్కువగా ,ఉన్న పనసపండు ,తినడం వల్ల ఉపయోగాలు


పనస పండ్లలోని ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. పనసలో ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. కణజాలాల నాశనాన్ని అడ్డుకుంటాయి.

పనస తొనలు తినడం ద్వారా మగవారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీర్యవృద్ధిని కలిగించి, అంగస్తంభన సమస్యల్ని తగ్గించి శృంగారంలో అధిక ఆనందం కలిగించేలా చేస్తుంది.

ఇది శరీరంలోని రోగ నిరోధరక శక్తిని పెంచుతుంది. శరీరంలోని అనేక రుగ్మతల బారినుండి కాపాడుతుంది. అంతేకాకుండా ఇది ప్రేగు మరియు లంగ్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలతో పోరాడి డి.ఎన్.ఎ ను డ్యామేజీ బారి నుండి కాపాడుతుంది. 4. ఇందులో ఉండే సోడియం అధిక రక్తపోటు బారి నుండి కాపాడి గుండె నొప్పి మరియు గుండె పోటు సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధుల నుండి కాపాడుతుంది.

uses,consumption,of minerals,and fiber,rich fruit ,ఖనిజాలు, ఫైబర్, ఎక్కువగా ,ఉన్న పనసపండు ,తినడం వల్ల ఉపయోగాలు


పనస పండు షుగర్ వ్యాధి ఉన్నవారికి మంచి ఆహారం. ఈ పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్ లెవల్ పెరిగేలా చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. రేచీకటి సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మం మరియు జుట్టు ఆరోగ్యంతో ఉండేలా సహాయపడుతుంది.

రక్తహీనత సమస్యతో బాధపడేవారికి పనసపండు మంచి ఫలితాన్నిస్తుంది. పనసపండులో ఉండే పోషకాలు మరియు విటమిన్స్ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది. పనసపండులో ఉన్న క్యాల్షియం శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది. ఎముకలు పెళుసుగా మారే సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియలను సాఫీగా జరిగేలా చేస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ మరియు అల్సర్ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. పనసపండు చర్మ కాంతిని పెంచుతుంది. చర్మంపై మృత కణాలు తొలగించి చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

Tags :
|

Advertisement