Advertisement

  • తొక్కే కదా అని తక్కువ అంచనా వేయకు..అరటి పండు తొక్క ఉపయోగాలు

తొక్కే కదా అని తక్కువ అంచనా వేయకు..అరటి పండు తొక్క ఉపయోగాలు

By: Sankar Mon, 22 June 2020 3:10 PM

తొక్కే కదా అని తక్కువ అంచనా వేయకు..అరటి పండు తొక్క ఉపయోగాలు



అరటి పండులో అనేక పోషక లక్షణాలు ఉంటాయి ..తక్షణమే శక్తి రావడంకోసం క్రీడాకారులు ఎక్కువగా అరటి పండ్లనే వాడుతుంటారు ..ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని తొందరగా అందిస్తాయి ..అయితే అరటిపండును మనం ఎంత ఇష్టంగా వెంటనే తింటామో , అరటి పండు తొక్కను కూడా అలానే వెంటనే పారేస్తాము ..అయితే అరటిపండు తొక్క వలన కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూదాం ..
1 అరటి పండులోని తొక్కలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి .. దీనిని తినడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతంది. ఒకవేళ తొక్కని పూర్తిగా తినకపోయినా.. అందులోని తెల్లని పదార్థాన్ని స్పూన్‌తో తీసుకోవచ్చు.

2 ఇక నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ పండు తొక్క లోపలి తెల్లభాగాన్ని తీసుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే దీనిని స్లీపింగ్ మెడిసిన్‌లా అనుకోవచ్చని చెబుతున్నారు.

3 అదే విధంగా కంటి చూపు మందగించిన వారికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల దృష్టి సంబంధ సమస్యలు తగ్గుతాయి. చూపు మెరుగ్గా ఉంటుంది. అరటి పండు తొక్కలో ల్యూటిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల అతి నీలలోహిత కిరణాల ప్రభావం నుంచి కళ్ళని కాపాడుకోవచ్చు.

4 స్టీల్, వెండి వస్తువులపై మరకలు పోవడానికి, డిష్‌వాషర్‌ సోప్‌ రసాయనాలను తొలగించడానికి అరటిపండు తొక్కతో రుద్ది కడగాలి. సేంద్రీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ నీటిని మొక్కలకు పోయవచ్చు నాన్‌స్టిక్‌ వంటపాత్రల లోపలి భాగాన్ని అరటిపండు తొక్కతో రుద్ది, కడిగితే కోటింగ్‌ త్వరగా పోదు.

5 దుమ్ము లేకుండా తడి క్లాత్‌తో తుడిచి, ఆ తర్వాత అరటిపండుతొక్కతో రుద్దితే షూ శుభ్రపడి, మెరుస్తాయి.

6 కట్టె ఫర్నీచర్, కట్టెతో తయారు చేసిన వస్తువులను అరటిపండు తొక్కతో రుద్ది, తడి క్లాత్‌తో తుడిస్తే మరకలు, గీతలు పోయి కొత్తవాటిలా మెరుస్తాయి ∙ఇంకు మరకలు పోవాలంటే అరటిపండు తొక్కతో రుద్ది, కడగాలి.

ఇలా అరటి పండును మాత్రమే కాకుండా దాని తొక్కను కూడా పైన చెప్పిన వాటిలో ఉపయోగించుకుంటే తొక్క వేయడం కోసం చెత్త బుట్టను వెతకాల్సిన పని ఉండదు..

Tags :
|
|

Advertisement