Advertisement

బేకింగ్ సోడా ఉపయోగాలు

By: Sankar Sun, 21 June 2020 7:07 PM

బేకింగ్ సోడా ఉపయోగాలు



బేకింగ్ సోడా వంట గదిలో ముఖ్యమైన వస్తువుల్లో అది ఒకటి ..బజ్జిలు , బొండాలు లాంటివి వేసుకోవాలి అంటే బేకింగ్ సోడా తప్పకుండ ఉంది తీరాల్సిందే ..అయితే కేవలం వంటల్లోకే కాకుండా మన ఆరోగ్యానికి కూడా బేకింగ్ సోడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది..అది ఎలాగో చూదాం ..

బయటకు ఎండకు వెళ్లి వచ్చినప్పుడు చర్మం నల్లగా అయిపోతుంది అలాంటప్పుడు ఆలా నల్లగా అయినా దగ్గర బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా అవుతుంది మరియు నలుపు దనం పోతుంది ..అలాగే ఏమైనా దురదలు ఉన్న పోతాయి ..

మనం తింటున్న స్పైసీ ఫుడ్స్ కీ, తాగుతున్న కాఫీ టీలకీ కేవలం రెండు పూటలా పళ్ళు తోముకుంటే సరిపోదు. మౌత్ వాష్ కూడా అవసరం అవుతోంది. పైగా ఈ మౌత్ వాష్ బ్రష్ చేరుకోలేని ప్రదేశాలని కూడా శుభ్రం చేస్తుంది. అయితే, ఇందు కోసం ప్రత్యేకంగా మౌత్ వాష్ కొనుక్కోక్కర్లేదు. అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర చెంచా బేకింగ్ సోడా వేసి మౌత్ వాష్ లా వాడొచ్చు. ఇది నోటి పుళ్ళని తగ్గించడమే కాకుండా పళ్ళు తెల్లగా మెరిసేటట్లు చేస్తుంది.

కూరగాయల మీదా పండ్ల మీద పురుగు మందులు ఉంటాయేమోనని మనందరికీ భయమే. ఒకటికి పదిసార్లు కడుగుతాం. తొక్క తీసేసి తినేవైతే పరవాలేదు. దొండకాయలూ, ద్రాక్షపండ్ల లాంటి వాటి సంగతేమిటి? ఇక్కడే బేకింగ్ సోడా ఆదుకుంటుంది. బేకింగ్ సోడా కలిపిన నీటిలో పదిహేను నిమిషాల పాటూ కూరగాయలూ, పళ్ళూ ఉంచితే మాగ్జిమం అన్ని రకాల పురుగు మందులూ పోతాయి.

బేకింగ్ సోడా మరకల్ని పోగొట్టడమే కాదు, బట్టల్ని తెల్లగా కూడా చేస్తుంది. మీరు మామూలుగా వాడే డిటర్జెంట్ తో పాటూ అందులో సగం బేకింగ్ సోడా కూడా కలపండి. బట్టలు శుభ్రం గా తెల్లగా వస్తాయి. వాషింగ్ మెషీన్ లో అన్ని రంగుల బట్టలూ ఒకేసారి వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి.

ఒక్కోసారి ఫ్రిజ్ తీయగానే చెడు వాసన వస్తుంది. ఇది కొన్ని పదార్ధాలు చాలా కాలం ఫ్రిజ్ లోనే ఉంచడం వల్ల వచ్చే వాసన. అయితే ఆ పదార్ధాలు తీసేసి ఫ్రిజ్ క్లీన్ చేసినా వాసన మాత్రం పోదు. అలాంటప్పుడు ఒక కప్ లో కొంచెం బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్ లో పెడితే ఈ వాసనలన్నీ పోతాయి.

Tags :
|

Advertisement