Advertisement

  • అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు వున్న పసుపు కలిపిన పాలు

అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు వున్న పసుపు కలిపిన పాలు

By: chandrasekar Tue, 30 June 2020 10:43 AM

అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు వున్న పసుపు కలిపిన పాలు


మ‌నం రోజు వంటింట్లో వాడే పదార్ధాలలో పసుపు ఒకటి. ప‌సుపు ఉంటే చాలు మనం ఏ వ్యాధినైనా ఇట్టే ఎదుర్కొవొచ్చు. ఎందుకంటే దీంట్లో అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ప‌సుపును నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

పాలలో పసుపు కలుపుకుని తాగితే చాలా ప్రయోజనాలున్నాయి. పసుపు పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. సాధారణంగా అందరికీ పసుపు, పాల కాంబినేషన్ గురించి తెలిసే ఉంటుంది. ఒక గ్లాసు పాలలో ఒక చెంచా పసుపు, ఒక చెంచా తేనె, కొద్దిగా నెయ్యి వేసి చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి వీటిని రోజూ రాత్రి పడుకోబోయే ముందు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

రుతుక్రమం సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం ఫలితంగా పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులు బాధిస్తాయి. ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే పసుపు పాలు సేవించాలి. పాలలో సెరటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్‌లు ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్‌తో కలిసి ఒత్తిడిని తొలగించటానికి తోడ్పడతాయి.

దీంతో మానసిక స్వాంతన చేకూరి హాయిగా నిద్ర పడుతుంది. అజీర్తి, ఛాతీలో మంట వంటివి ఈ పసుపు పాలు తాగితే తగ్గిపోతాయి. కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రక్తపోటు నియంత్రణలో వుంచుతాయి. కేన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కనుక పసుపు పాలను తాగుతూ వుంటే అనారోగ్యాలను దరి చేరనివ్వదు.

ఈ పాలలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇన్‌ఫ్లేమటరీ గుణాలుంటాయి కనుక రోగ నిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. జీవక్రియల పనితీరు మెరుగవుతుంది. దీనివల్ల అదనపు బరువు తగ్గి కంట్రోల్‌లో వుంటుంది. కీళ్ల వాపులు, నొప్పులు తగ్గాలంటే పసుపు పాలను క్రమం తప్పకుండా తాగాలి. ఈ పాలు తాగటం వల్ల కీళ్ల కదలికలు, కండరాల పటుత్వం పెరుగుతాయి.

పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్తం శుద్ధి చేస్తుంది. మీరు రెగ్యులర్ గా పసుపు, పాలను తీసుకుంటేనే ఈ ప్రయోజనం మీకు కనపడుతుంది.

Tags :
|
|

Advertisement