Advertisement

పసుపుతో థైరాయిడ్ కంట్రోల్

By: chandrasekar Wed, 26 Aug 2020 12:14 PM

పసుపుతో థైరాయిడ్ కంట్రోల్


చిన్న‌వ‌య‌సులోనే థైరాయిడ్ వ్యాధి బారిన ప‌డి ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. థైరాయిడ్ వ‌స్తే కొంత‌మంది లావెక్కుతారు. మ‌రికొంత‌మంది స‌న్న‌గ‌ అవుతారు. దీనికి ట్రీట్‌మెంట్ తీసుకోకుంటే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతుంది. ఈ విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏమాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా స‌మ‌స్య‌ల‌ను వస్తాయి. ఆ ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే స‌రిపోతుంది.

* ప్ర‌తిరోజూ వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ లేదా వాల్న‌ట్స్‌ను డైట్‌లో యాడ్ చేసుకుంటే ఓమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్కంగా దొర‌కుతాయి. ఇవి థైరాయిడ్‌కు బాగా ప‌నిచేస్తుంది.

* విటమిన్ డితో పాటు సెలీనియం, విటమిన్ ఏ, జింక్, ఒమేగా-3 ఫ్యాట్స్ లోపాలు ఉన్నాయేమో ఒక‌సారి చెక్ చేపించుకోవాలంటున్నారు నిపుణులు.

* తినే ఆహారంలో ప‌సుపు తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ లభిస్తాయి. ఇది వంట‌ల్లో క‌లిసిపోయి శ‌రీరంలోని ఇన్ల్ఫ‌మేష‌న్‌ను త‌గ్గిస్తుంది.

* విట‌మిన్ డి లోపం వ‌ల్ల ఇమ్యూన్ సిస్టం దెబ్బ‌తింటుంది. రోజూ 20 నిమిషాల పాటు ఎండ‌లో ఉండ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ను అదిగ‌మించ‌వ‌చ్చు. ఆకుకూర‌లు, స‌లాడ్స్ వ‌ల్ల కూడా విట‌మిన్ డి లెవెల్స్‌ను పెంచుకోవ‌చ్చు. ఈ విధంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల థైరాయిడ్ నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.

Tags :

Advertisement