Advertisement

  • బిపి అదుపులో ఉండాలంటే మన ఆహారంలో ఇవి ఉండాల్సిందే ...

బిపి అదుపులో ఉండాలంటే మన ఆహారంలో ఇవి ఉండాల్సిందే ...

By: Sankar Mon, 13 July 2020 1:32 PM

బిపి అదుపులో ఉండాలంటే మన ఆహారంలో ఇవి ఉండాల్సిందే ...



హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. రక్త నాళాల గోడలు మందంగా మారడం వల్ల రక్త ప్రసరణపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. పొగ పీల్చడం, ఆల్కహాల్ సేవించడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడూ కూర్చొని పని చేయడం తదితర అలవాట్లు హై బీపీకి దారి తీస్తాయి.

అయితే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ, ఆల్కహాల్ తీసుకోవడాన్ని తగ్గించడం వల్ల బీపీని నియంత్రణలో ఉంచొచ్చు. బీపీని కంట్రోల్‌లో ఉంచడంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కీలక పాత్ర పోషిస్తాయి. హైపర్‌టెన్షన్‌‌‌ను నియంత్రించడానికి ఈ మూడు న్యూట్రియెంట్స్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

కండరాలు సరిగా పని చేయడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది బీపీని నియంత్రించి ధమనుల గోడలను రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. హృదయ స్పందనలు అదుపు తప్పకుండా పొటాషియం సహాయపడుతుంది. నారింజ, పుట్టగొడుగులు, పాలకూర, బ్రకోలి, అల్‌బుకారా, చిలగడ దుంపలు, అరటి పండ్లలో పొటాషియం అధిక మోతాదులో లభిస్తుంది.


foods,help,control,bp,calcium,magnesium,potassium ,బిపి , అదుపులో,  ఉండాలంటే , పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఉండాల్సిందే



శరీర వ్యవస్థలను నియంత్రించడంలో మెగ్నీషియం తోడ్పడుతుంది. బీపీ, షుగర్ స్థాయిలతోపాటు కండరాలు, నరాల వ్యవస్థలను నియంత్రించడంలో మెగ్నీషియం ఉపకరిస్తుంది. శక్తి ఉత్పత్తికి, ఎముకలు పటిష్టంగా మారడానికి మెగ్నీషియం అవసరం. బీపీని తగ్గించడంతోపాటు కాల్షియం, పొటాషియంల రవాణాలోనూ మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మూత్రం ద్వారా పొటాషియం, మెగ్నీషియంలను శరీరం భారీగా కోల్పోతుంది. కాబట్టి మెగ్నీషియం స్థాయిలను పెంచుకోవడం కోసం అరటి పండ్లు, అవకాడో, నట్స్, బ్లాక్ బీన్స్, బచ్చలి కూరలను ఎక్కువగా తీసుకోవాలి..

ఎముకలను దృఢంగా ఉంచడంతోపాటు హైపర్‌టెన్షన్‌ను అరికట్టడానికి కాల్షియం ఎంతో అవసరం. కాల్షియం లోపంతో బాధపడే వారికి హైబీపీ ముప్పు ఎక్కువ. శరీర క్రియలు సజావుగా సాగడానికి అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్‌ల విడుదలలో కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పాలు, పెరుగు, వెన్న, సల్మాన్ చేపలు, ఆకు కూరల్లో కాల్షియం విరివిగా లభిస్తుంది..



Tags :
|
|
|

Advertisement