Advertisement

  • ప్రతి రోజూ ఈ ఆహారం తీసుకుంటే మధుమేహ రోగులు కు కరోనా ముప్పు ఉండదు!

ప్రతి రోజూ ఈ ఆహారం తీసుకుంటే మధుమేహ రోగులు కు కరోనా ముప్పు ఉండదు!

By: chandrasekar Sat, 18 July 2020 8:16 PM

ప్రతి  రోజూ ఈ ఆహారం తీసుకుంటే మధుమేహ రోగులు కు కరోనా ముప్పు ఉండదు!


మధుమేహ రోగులు (డయబెటిక్స్), పిల్లలు, వృద్ధులకు కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ప్రమాదకరమనే సంగతి తెలిసిందే. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వీరి శరీరం వైరస్‌తో పోరాడలేదని వైద్యులు తెలుపుతున్నారు. కాబట్టి, వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా తమ శరీరంలో బ్లడ్ సుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని, లేకపోతే వైరస్ సోకిన తర్వాత పరిస్థితి మరింత దయనీయముగా మారుతుందని తెలియజేస్తున్నారు . అయితే, పండ్లు, కూరగాయల ద్వారా మధుమేహ రోగులు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన ఈ సర్వేల్లో ఏం చెప్పారో చూద్దాo.

టైప్-1, టైప్-2 డయబెటిక్‌లకు చాలా వ్యత్యాసం ఉందనే సంగతి తెలిసిందే. టైప్-1 పుట్టుక నుంచే ఉంటే.. టైప్-2 ఆహారపు అలవాట్లు, జీవనశైలి గతి తప్పడం వల్ల వస్తుంది. కొందరిలో పూర్వికుల నుంచి కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఒక్కసారి వచ్చిందంటే.. ఆయుష్సు సగానికి పడిపోయినట్లే. అయితే, ఆహారపు అలవాట్లను సక్రమంగా పాటిస్తూ శరీరానికి తగిన వ్యాయామం అందిస్తూ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా మాయం చేయొచ్చు. ప్రస్తుతం కరోనా ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఇవన్నీ పాటించడం తప్పనిసరి అని తెలియజేయడమైనది.

టైప్-2 డయబెటీస్ వచ్చే అవకాశాలు 29 శాతం తక్కువని తేలింది. ముఖ్యంగా చిరు ధాన్యాలు, బ్రౌన్ రైస్, జొన్న, మొక్క జొన్న, గోదుమ పిండి చపాతీ లేదా రోట్లు తినేవారిలో డయబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువ. వీటిలో అధిక ఫైబర్ వల్ల కడుపు నిండిన భావము కలుగుతుందని, దీనివలన ఎక్కువగా చక్కెర శరీరానికి అందకుండా జాగ్రత్తపడవచ్చని స్టడీలో పేర్కొన్నారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లను ఎక్కువగా తినడాన్ని అలవాటు చేసుకుంటే.. మంచిదని చెబుతున్నారు. ఒకవేళ కరోనాకు గురైనా.. ఆరోగ్యవంతుల్లా సులభంగా బయటపడవచ్చని తెలుపుతున్నారు. కాబట్టి ఆహార నియమాల్ని పాటించి జాగ్రత్తగా ఉండండి.

ముఖ్య గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.మీరు మధుమేహంతో బాధపడుతున్నట్లయితే వైద్యులు, ఆహార నిపుణుల సూచనలు తప్పక తీసుకోవాలి.

Tags :

Advertisement